Save Damagundam forests । దామగుండం అడవులను రక్షించుకుందాం : ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో ప్రకృతి ప్రేమికులు
దామగుండం అడవుల్లో దాదాపు 12 లక్షల చెట్లనును నరికేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు కన్నెర్ర చేశారు. దామగుండం అడవిని రక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పిలుపునిచ్చారు.

Save Damagundam forests । నేవీ రాడార్ పేరుతో పరిగి నియోజకవర్గంలోని దామగుండం అడవుల్లో దాదాపు 12 లక్షల చెట్లనును నరికేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు కన్నెర్ర చేశారు. దామగుండం అడవిని రక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పిలుపునిచ్చారు. హైడ్రా పేరుతో చెరువులను, కుంటాలను కాపాడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇంత విధ్వంసం జరిగుతుంటే పట్టించుకోకపోవడంపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
నేవి రాడర్ దామగుండంలో నెలకొల్పవద్దంటూ తాను స్వయంగా రామన్న మాదిగ ఆధ్వర్యంలో ఆ అడవిని పూర్తిగా పరిశీలించి 2017లో పూడూరు గేట్ దగ్గర ధర్నా చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నాటి నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమ వేదిక జిల్లాలోని ప్రజల్ని మేలుకొల్పుతోనే ఉందని చెప్పారు. దామగుండం అడవులను కాపాడుకునేందుకు ఉద్యమమంలో పాల్గొనాలని ప్రజలకు, యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ రావు, రామన్న మాదిగ, జర్నలిస్టు తులసి చంద్, విమలక్క, సునంద, బుగ్గన్న యాదవ్, గౌరగళ్ళ కృష్ణ మౌర్య, సంధ్యక్క నిత్యనంద స్వామి, గీత మహేందర్, ఇందిర, పూడూరు గ్రామ ప్రజలు, పరిగి నియోజకవర్గం నాయకులు విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.