Special Trains | సమ్మర్‌లో ఊళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య మరో శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో రైళ్లలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించింది. తాజాగా మరికొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. వేసవి నేపథ్యంలో కొనసాగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

  • Publish Date - April 24, 2024 / 12:30 PM IST

Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య మరో శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో రైళ్లలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించింది. తాజాగా మరికొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. వేసవి నేపథ్యంలో కొనసాగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌ – ఉదయంపూర్‌ సిటీ, ఉదయపూర్‌సిటీ – సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ – కటక్‌, కటక్‌ – హైదరాబాద్‌, నాందేడ్‌ – నిజాముద్దీన్‌, నిజాముద్దీన్‌ – నాందేడ్‌, నర్సాపూర్‌ – బెంగళూరు, బెంగళూరు – నర్సాపూర్‌ రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య పేర్కొంది. సికింద్రాబాద్‌ – ఉదయ్‌పూర్‌ సిటీ (07123) రైలును ఈ నెల 30 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఉదయ్‌పూర్‌ సిటీ – సికింద్రాబాద్‌ (07124) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం నడుస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌-కటక్‌ (07165) మే 7 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం, కటక్‌-హైదరాబాద్‌ రైలు మే 8 నుంచి జూన్‌ 26 వరకు బుధవారం పరుగులు తీస్తుందని చెప్పింది. నాందేడ్‌ – నిజాముద్దీన్‌ (07621) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం.. నిజాముద్దీన్‌ – నాందేడ్‌ (07622) మే 5 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి ఆదివారం నడుస్తుందని పేర్కొంది. నర్సాపూర్‌ – బెంగళూరు (07153) మే 3 నుంచి జూన్‌ 28 వరకు ప్రతి శుక్రవారం, బెంగళూరు – నర్సాపూర్‌ (07154) మే 4 నుంచి జూన్‌ 29 వరకు శనివారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

Latest News