Special Trains | సికింద్రాబాద్‌ నుంచి బర్హంపూర్‌కు ప్రత్యేక రైళ్లు

Special Trains | సికింద్రాబాద్‌ నుంచి బర్హంపూర్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్‌-బర్హంపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 11, 14వ తేదీల్లో నడువనున్నట్లు తెలిపింది. బర్హంపూర్‌ - సికింద్రాబాద్‌ మధ్య 12, 15 తేదీల్లో పరుగులు తీస్తాయని వివరించింది.

Special Trains | సికింద్రాబాద్‌ నుంచి బర్హంపూర్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్‌-బర్హంపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 11, 14వ తేదీల్లో నడువనున్నట్లు తెలిపింది. బర్హంపూర్‌ – సికింద్రాబాద్‌ మధ్య 12, 15 తేదీల్లో పరుగులు తీస్తాయని వివరించింది. సికింద్రాబాద్‌ – బర్హంపూర్‌ రైలు ఆయా రోజుల్లో రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బర్హంపూర్‌ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్‌, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్‌, నౌపాడ జంక్షన్‌, పలాస, సోంపేట, ఇచ్చాపురం మీదుగా రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.