విధాత,కరీంనగర్: జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ […]
విధాత,కరీంనగర్: జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.