కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన కడియం: రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవినీతి తిమింగలమని బీఆర్‌ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతానని కేసీఆర్ ను కడియం బ్లాక్ మెయిల్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు

విధాత : స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవినీతి తిమింగలమని బీఆర్‌ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతానని కేసీఆర్ ను కడియం బ్లాక్ మెయిల్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవాం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కడయం స్టేషన్ ఘన్‌పూర్ కు చేసిందేమీ లేదని, కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే పార్టీ మారారని విమర్శించారు.
పార్టీ ఫిరాయించిన శ్రీహరికి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఆయనకు స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలు కర్రుకాల్చి వాత పెడుతారని జోస్యం చెప్పారు. తన బిడ్డను ఎంపీగా చేయడానికి కాంగ్రెస్ లో చేరి, తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారన్నారు. 15 ఏళ్లు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కడియం విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోస్టులు అమ్ముకున్నారని, బినామీల పేరుతో ఆయనకు కోట్ల ఆస్తులు ఉన్నాయని రాజయ్య ఆరోపణలు చేశారు.