తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాల ప్రభావం దక్షిణ, తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాలపై ఉండే అవకాశం ఉంది, కొన్ని చోట్ల ఉరుములు, బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు కోరారు.

ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తదుపరి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Latest News