Andrapradesh | బలపడిన అల్పపీడనం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
విధాత, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడం ప్రభావంతో రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే.. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మలక్కా జలసంధి, ఇండోనేషియాను ఆనుకుని ఉన్న “సెన్యార్” తుపాను తీరం దాటిందని తెలిపింది. ఆ తరువాత 48 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్య కారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram