IMD Alert | రాష్ట్రానికి తుఫాను ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మొంథా తుఫాను ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాను హెచ్చరికను జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్టు ధృవీకరించిన వాతావరణ శాఖ.

  • By: chinna |    news |    Published on : Nov 23, 2025 7:03 PM IST
IMD Alert | రాష్ట్రానికి తుఫాను ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక

విధాత, హైదరాబాద్ :

మొంథా తుఫాను ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాను హెచ్చరికను జారీ చేసింది.
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్టు ధృవీకరించిన వాతావరణ శాఖ. ఈ అల్పపీడనం నవంబర్ 24 నాటి వాయగుండంగా మారి క్రమంగా బలపడుతూ 30 వ తేదీకి తీవ్రంగా మారి పూర్తి స్థాయి తుఫానుగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు- దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుందని ఐఎండి ప్రకటించింది.

ఈ తుఫాను కారణంగా నవంబర్ 28 నుంచి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాల ఉధృతి గణనీయంగా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరిచింది. ఈ జిల్లాల్లో గురువారం నుంచి శనివారం వరకు వర్షాలు పడుతాయని ఆతరువాత ఆదివారానికి గరిష్ట స్థాయికి చేరతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, ఇప్పటికే రాయలసీ,దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడడం మొదలయ్యాయి. ఆదివారం కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడగాయని ఏపీ విపత్తుల నిర్వహణ ఆథారిటీ వెల్లడించింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికారులు మత్స్యకారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 27 వరకు ఉత్తర తమిళనాడు – దక్షిణ ఆంధ్రాతీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంద, గంటకు 45 నుంచి 55 కిలోమీటరల్ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది.