కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదిపై తీర్పు 22కు వాయిదా !

కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఏప్రిల్ 22కు వాయిదా పడింది. కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.

Kaleshwaram project case

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిపై తీర్పును తెలంగాణ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్,హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా నివేదిక రూపొందించారని దీనిని రద్దు చేయాలంటూ కోర్టును కోరారు. ​గత కొన్ని రోజులుగా ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ముందుగా బుధవారం తీర్పు వెలువరించేందుకు సిద్దమైంది. అయితే అనూహ్యంగా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్‌‌‌‌‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ను నియమించింది. అయితే 2024 మార్చి 14న జారీ చేసిన కమిషన్ నియామక జీవో నెంబర్ 6ను కొట్టివేయాలని, అలాగే కమిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు, ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.కె. జోషిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్‌‌‌‌‌‌‌‌లపై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జీఎం మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ ఇరుపక్షాల వాదనలను విని మార్చి 12న తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించాల్సిన హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి :

ఇదేం ఆన్, ఆఫ్ పద్దతి ?.. మంత్రి ఉత్తమ్ కు హరీశ్ రావు లేఖ!
Triumph 350 CC Engine | ఇంజిన్ కెపాసిటీ తగ్గింది.. ధర మాత్రం పెద్దగా తగ్గలేదు.. నిరాశపరిచిన ట్రయంఫ్ నిర్ణయం!

Latest News