Municipal Reservations : మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు! 10 కార్పొరేషన్ల మేయర్ స్థానాల ప్రకటన. మహిళలకు 50% కోటా.. జీహెచ్‌ఎంసీ సహా కీలక నగరాలు జనరల్ మహిళకే కేటాయింపు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కీలకమైన రిజర్వేషన్ల ఘట్టం పూర్తయ్యింది. రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ డైరక్టర్ శ్రీదేవి ప్రకటించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీల(31.4%)కు కేటాయించారు.
10కార్పేషన్ల మేయర్ల రిజర్వేషన్ల వెల్లడి
రాష్ట్రంలోని 10 కార్పొరేషన్ లలో కొత్తగూడెం st జనరల్, రామగుండం sc జనరల్, మంచిర్యాల, కరీంనగర్ bc జనరల్, మహబూబ్ నగర్ bc మహిళ కు కేటాయించారు.
హైదరాబాద్ GHMC, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ లను “జనరల్ మహిళ” కు, గ్రేటర్ వరంగల్ జనరల్ కు కేటాయించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram