విధాత, హైదరాబాద్ : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. క్యాలెండర్ ఇయర్ లో పాఠశాలల మొత్తం వర్కింగ్ డేస్ 227గా వెల్లడించింది. దసరా సెలవులను ఆక్టోబర్ 10నుంచి 22వరకు(13రోజులు), సంక్రాంతి సెలవులు 2027 జనవరి 13నుంచి 17వరకు(5రోజులు) ఉంటాయని పేర్కొంది. 1-9 తరగతులకు 2027 ఫిబ్రవరి 28లోగా సిలబస్ పూర్తి చేయాలని నిర్దేశించింది.
పాఠశాలల ఆఖరి వర్కింగ్ డే ఏప్రిల్ 23గా తెలిపింది. ఏప్రిల్ 24నుంచి జూన్ 13వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో పాఠశాలల వేసవి సెలవుల పొడిగింపు నేపథ్యంలో ఈ నెల 15నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడామిక్ క్యాలెండర్ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉండనుందని సమాచారం.
