Dasara Holidays | తెలంగాణ‌లో అక్టోబ‌ర్ 2 నుంచి ద‌స‌రా సెల‌వులు.. ఎన్ని రోజులో తెలుసా..?

తెలంగాణ‌( Telangana )లోని విద్యార్థుల‌కు మ‌ళ్లీ హాలీడేస్( Holidays ) రానున్నాయి. అక్టోబ‌ర్ 2 నుంచి ద‌స‌రా సెల‌వులు( Dasara Holidays ) ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ 15వ తేదీన పాఠ‌శాల‌లు తిరిగి తెరుచుకోనున్నాయి.

Dasara Holidays | తెలంగాణ‌లో అక్టోబ‌ర్ 2 నుంచి ద‌స‌రా సెల‌వులు.. ఎన్ని రోజులో తెలుసా..?

Dasara Holidays | హైద‌రాబాద్ : వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రులు ముగిశాయి. ఇక త్వ‌ర‌లో వ‌చ్చే పండుగ బ‌తుక‌మ్మ‌( Bathukamma ), ద‌స‌రా ఉత్స‌వాలు( Dasara Festival ). అయితే తెలంగాణ‌లో ద‌స‌రా పండుగ సెల‌వులు అక్టోబ‌ర్ 2 నుంచి ఇవ్వాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణ‌యించింది. అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు అంటే 13 రోజుల పాటు ద‌స‌రా సెల‌వుల‌ను నిర్ణ‌యించారు. బ‌తుక‌మ్మ వేడుకలు అక్టోబ‌ర్ 2వ తేదీన ప్రారంభం కానున్నాయి. అక్టోబ‌ర్ 15వ తేదీన తిరిగి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి.

ఇక క్రిస్మ‌స్( Christamas ) వేడుక‌ల‌కు డిసెంబ‌ర్ 23 నుంచి 27వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు ఇవ్వ‌నున్నారు. సంక్రాంతి( Sankranthi ) సెల‌వులు జ‌న‌వ‌రి 13 నుంచి 17 వ‌ర‌కు ప్ర‌క‌టించారు. అంటే ఐదు రోజులు సంక్రాంతి సెల‌వులు ఇచ్చారు.