Dasara Holidays | ఎల్లుండే నుంచే దసరా సెలవులు.. పిల్లలకు పండుగే పండుగ
Dasara Holidays | దసరా సెలవులు( Dasara Holidays )వచ్చేశాయ్. శనివారం ఒక్క రోజు మాత్రమే పాఠశాలలు( Schools ) పని చేయనున్నాయి. ఇక సోమవారం నుంచి 13 రోజుల పాటు దసరా హాలీడేస్ ప్రకటించడంతో పిల్లలు ఎగిరి గంతేస్తున్నారు. పండుగే పండుగ అంటూ సంబురపడిపోతున్నారు.

Dasara Holidays | హైదరాబాద్ : తెలంగాణ( Telangana )కు దసరా శోభ వచ్చింది. ఎందుకంటే దసరా సెలవుల( Dasara Holidays ) నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు( Educational Institutions ) మూతపడనున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దసరా హడావుడి మొదలైంది. 22 నుంచి బతుకమ్మ( Bathukamma ) సంబురాలు కూడా ప్రారంభం కానున్నాయి. దసరా సెలవుల కారణంగా ముందస్తుగానే విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్( School Education ) డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం ఒక్క రోజే వర్కింగ్ డే. ఇక ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి.. సోమవారం నుంచి పాఠశాలలకు( Schools ) హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన జరుపుకోనున్నారు.
దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 24 నుంచి 31వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్(SA 1) నిర్వహించనున్నారు. నవంబర్ 6వ తేదీ నాటికి ఫలితాలు వెల్లడించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్(SA 2) నిర్వహించనున్నారు. ఎస్ఏ2 కేవలం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మాత్రమే నిర్వహించనున్నారు.
ఇక పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28 లోపు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 2026 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు.