Group-1 | గ్రూప్-1 నోటిఫికేష‌న్‌పై విచార‌ణ పూర్తి.. తీర్పుపై ఉత్కంఠ‌..

Group-1 | గ్రూప్-1 మెయిన్స్( Group-1 Mains ) ప‌రీక్ష‌లు ఈ నెల 21 నుంచి జ‌రుగుతాయా..? లేదా..? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గ్రూప్-1 నోటిఫికేష‌న్‌పై దాఖ‌లైన వివిధ పిటిష‌న్ల విచార‌ణ‌ను హైకోర్టు( TG Highcourt ) పూర్తి చేసింది. తీర్పును మాత్రం రిజ‌ర్వ్ చేయ‌డంతో అభ్య‌ర్థుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

Group-1 | గ్రూప్-1 నోటిఫికేష‌న్‌పై విచార‌ణ పూర్తి.. తీర్పుపై ఉత్కంఠ‌..

Group-1 | హైద‌రాబాద్ : టీజీపీఎస్సీ( TGPSC ) ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న గ్రూప్-1( Group-1 ) నియామ‌క ప్ర‌క్రియ‌పై హైకోర్టు( Highcourt )లో విచార‌ణ పూర్త‌యింది. విచార‌ణ అనంత‌రం తీర్పును రిజ‌ర్వ్ చేస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. కీ, రీ నోటిఫికేష‌న్, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం మెరిట్ జాబితాను మ‌ళ్లీ విడుద‌ల చేయాల‌ని ప‌లువురు అభ్య‌ర్థులు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్ల‌పై కోర్టు విచార‌ణ పూర్తి చేసింది. అన్ని అభ్యంత‌రాల‌ను ప‌రిశీలించాకే తుది కీని విడుద‌ల చేశామ‌ని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు ఉండ‌డంతో ఈ కేసు విచార‌ణ‌కు హైకోర్టు ప్రాధాన్య‌త ఇచ్చింది. తీర్పుపై అభ్య‌ర్థుల్లో ఉత్కంఠ నెల‌కొంది. గ్రూప్-1 అభ్య‌ర్థులంద‌రూ హైకోర్టు తీర్పు కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.