Traffic Restrictions | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ప్రకటించారు. సద్దుల బతుకమ్మ( saddula Bathukamma ) వేడుకల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ బండ్( Tank Bund ), హుస్సేన్ సాగర్( Hussain Sagar ), నెక్లెస్ రోడ్డుతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
వాహనాల మళ్లింపు ఇలా..
సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో తెలుగు తల్లి జంక్షన్, కర్బాలా మైదానం, ఇక్బాల్ మినార్, నెక్లెస్ రోటరీ, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ ఎక్స్ రోడ్డు, రాణిగంజ్, నల్లగుట్ట వద్ద వాహనాలను మళ్లించనున్నారు.
ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను ఇందిరా పార్క్, గాంధీ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ప్రసాద్ ఐమ్యాక్స్, మింట్ కంపౌండ్ లేన్, కవాడిగూడ వైపు మళ్లించనున్నారు.
ఆర్టీసీ బస్సులు మళ్లింపు ఇలా..
సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను మెట్టుగూడ, తార్నాక, బర్కత్‌పురా, చాదర్‌ఘాట్ మీదుగా మళ్లించనున్నారు.
సిటీ బస్సులను కర్బాలా మైదానం, కవాడిగూడ, బండ మైసమ్మ టెంపులు, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లించనున్నారు.
బతుకమ్మ వేడుకలకు వచ్చే వారు తమ వాహనాలను స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, రేస్ కోర్స్ రోడ్, బీఆర్కే భవన్ రోడ్, హెచ్ఎండీఏ పార్కింగ్, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కు ఎదురుగా పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పార్కింగ్, వాహనాల మళ్లింపునకు సంబంధించి ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించొచ్చని పోలీసులు తెలిపారు.