Vemulawada Rajanna l ఎములాడ రాజన్ననే మోసం చేశారు: కాంగ్రెస్ నేత శ్రీనివాస్
Vemulawada Rajannane cheating chesaru విధాత: ఎములాడ రాజరాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని రూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చిన స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ నిండా మోసం చేశారని సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సంకెపల్లిలో ఆయన వేములవాడ ఎమ్మెల్యే రమేష్ పై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు అడుగు కూడా ముందుకు సాగడం లేదు. 2018 దసరాకు సాగునీరు ఇస్తామన్న మంత్రి టి.హరీశ్ రావు హామీ […]

Vemulawada Rajannane cheating chesaru
విధాత: ఎములాడ రాజరాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని రూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చిన స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ నిండా మోసం చేశారని సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సంకెపల్లిలో ఆయన వేములవాడ ఎమ్మెల్యే రమేష్ పై ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు అడుగు కూడా ముందుకు సాగడం లేదు. 2018 దసరాకు సాగునీరు ఇస్తామన్న మంత్రి టి.హరీశ్ రావు హామీ ఐదు దసరాలు పూర్తయినా నెరవేరలేదని ఆరోపించారు. నాంపల్లి పల్లగుట్ట ప్రాంతంలో పేదలకు కాంగ్రెస్ హయాంలో పంచిన భూములను ధరణి వెబ్ సైట్ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నదన్నారు. పది నెలల్లో ఈ సమస్యను పరిష్కరించి పేదలకు భూములు తిరిగి ఇవ్వాలని, లేదంటే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో అటవీ అనుమతులు లేక రోడ్డు పనులు నిలిచిపోయినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న హమీని విస్మరించారని అన్నారు. వేములవాడలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించడం లేదని ఆరోపించారు. తిప్పాపూర్ బస్టాండ్‌ను కావాలనే కూల్చివేసి వేరే చోట నిర్మాణం చేయాలని చూస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
జర్మనీలో ఎమ్మెల్యే ఉంటూ ఆన్ లైన్‌లో మాట్లాడుతూ కట్టుకథలు చెబుతున్నాడన్నారు. రూ.22 కోట్లతో చేపట్టిన మూల వాగు బ్రిడ్జీ కుప్పకూలిందన్నారు. రూ.300 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు వేశారని అంటున్నారని, ప్రతి రోడ్డుపై గుంటలు తేలి ఉన్నాయన్నారు. వేములవాడ పట్టణంలో కూడా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. జర్మనీలో స్థిరపడడంతో ఏ ఊరికి ఆయనను రానివ్వడం లేదని శ్రీనివాస్ అన్నారు.