Site icon vidhaatha

Credit Card | మీకు క్రెడిట్‌ కార్డు ఉందా..? బ్యాంకులు క్రెడిట్‌ లిమిట్‌ను ఎలా నిర్ణయిస్తాయో తెలుసా..?

Credit Card |

ప్రస్తుత కాలంలో క్రెడిట్‌ కార్డు గురించి తెలియనివారుండరు. చాలామంది వద్ద ఏదో ఒక బ్యాంకు సంబంధించిన క్రెడిట్‌ ఉండనే ఉంటుంది. ఈ క్రెడిట్‌కార్డుతో చాలానే ఉపయోగాలున్నాయి. ఏదైనా అవసరం ఉన్న సమయంలో వాడుకొని.. 50 రోజుల తర్వాత చెల్లించే సదుపాయం ఉన్నది. ఇటీవల కాలంలో బ్యాంకులతో పాటు పలు కంపెనీలు సైతం పెద్ద ఎత్తున క్రెడిట్‌కార్డులను జారీ చేస్తున్నాయి.

ఒక్కో బ్యాంకు తమ కస్టమర్స్‌ రెండు మూడేసి కార్డులు సైతం జారీ చేస్తున్నాయి. బ్యాంకులు ఒక్కో కార్డుపై ఒక్కో రకమైన క్రెడిట్‌ లిమిన్‌ను అందిస్తుంటాయి. ఒకో కార్డుపై రూ.లక్ష వరకు ఇస్తే మరో కార్డుపై తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఒకే బ్యాంకు ఇలా పలు రకాలుగా క్రెడిట్‌ లిమిట్‌ను జారీ చేస్తుంటాయో చాలా మందికి తెలియదు.

క్రెడిట్ కార్డ్‌తో స్వల్పకాలిక అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా క్రెడిట్‌కార్డును లిమిట్‌ను బట్టి వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈ క్రెడిట్‌ లిమిట్‌ అనేది ఒక రకమైన లోన్‌లాంటిదే. దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. ఎక్కువగా వాడి తర్వాత.. సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవు.

ప్రతి క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ ఉంటుంది. ఈ పీరియడ్‌లోనే కార్డు బిల్లు జారీ అవుతుంది. ఆయా క్రెడిట్‌కార్డుతో చేసిన లావాదేవీలన్నీ వచ్చే నెల స్టేట్‌మెంట్‌లో చేర్చడానికి సమయం ఉంటుంది. మీ కార్డ్‌ బిల్లు ఆగస్టు 1న తేదీన బిల్లు జనరేట్‌ అవుతుందని అనుకుంటే.. మీరు ఆగస్టు 2న కొన్ని లావాదేవీలు జరిపితే ఆ లావాదేవీలకు సంబంధించిన బిల్లు సెప్టెంబర్‌ ఒకటో తేదీన జనరేట్‌ అయ్యే బిల్లుల్లో కనిపిస్తాయి.

బిల్లింగ్‌కు నెల రోజులు సమయం ఉంటుంది. అలాగే బిల్లు జనరేట్‌ అయిన 20 రోజుల వరకు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. క్రెడిట్‌కార్డు బిల్లు తప్పని సరిగా చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే నెలకు 3శాతం నుంచి 4శాతం వరకు వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇది సంవత్సరానికి 36 నుంచి 48శాతానికి సమానం. అయితే, మొత్తం బిల్లుచెల్లించలేని సమయంలో కొన్నిసారు సాధారణంగా బిల్లుపై 5శాతం మినిమ్‌ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

పూర్తి బిల్లు చెల్లించకపోయినా మినిమమ్‌ బిల్లు కట్టడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ దిగజారకుండా నిర్వహించడంలో సహాయం చేస్తుంది. దాంతో భవిష్యత్‌లో కొత్తగా రుణాలు తీసుకోవడంతో పాటు క్రెడిట్‌కార్డులు తీసుకోవడంలో సహాపడుతుంది. ఆయా కంపెనీలు ‘క్రెడిట్ లిమిట్’ అనేది మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఖర్చు చేసే గరిష్ఠ మొత్తం. క్రెడిట్ కార్డ్ కంపెనీ మీ ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, పేమెంట్‌ హిస్టరీని బట్టి క్రెడిట్‌ పరిమితిని నిర్ణయిస్తాయి.

Exit mobile version