WhatsApp | మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్న వాట్సాప్‌.. ఆడియో కాల్స్‌ కోసమే..!

WhatsApp | ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ని పరిచయం చేసింది. యూజర్లను కొత్త కొత్త ఫీచర్స్‌తో ఆకర్షిస్తూ వస్తున్నది. భద్రత కోసం ఇప్పటికే పలు రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్‌ మరో ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది.

  • Publish Date - May 12, 2024 / 10:55 AM IST

WhatsApp | ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ని పరిచయం చేసింది. యూజర్లను కొత్త కొత్త ఫీచర్స్‌తో ఆకర్షిస్తూ వస్తున్నది. భద్రత కోసం ఇప్పటికే పలు రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్‌ మరో ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. వాట్సాప్ కాల్స్ కోసం నావిగేషన్‌ను మెరుగుపరిచేందుకు కొత్తగా ఆడియో కాల్ బార్ ఫీచర్ తీసుకురాబోతున్నది. ఈ కొత్త ఫీచర్ యాప్‌లో అవుట్‌గోయింగ్ ఆడియో కాల్‌లను పెంచేందుకు యూజర్లకు మరింత కంట్రోల్ అందించడమే లక్ష్యంగా ఫీచర్‌ను తీసుకురాబోతున్నది.

కాల్ కనెక్ట్ చేసిన తర్వాత.. యూజర్ కాల్‌ను క్రియేట్ చేసిన తర్వాత రీస్టోర్ చేసిన కాల్ బార్ ఇంటర్‌ఫేస్‌పైన కనిపిస్తుంది. అవుట్‌ గోయింగ్ కాల్‌ను కంట్రోల్ చేసేందుకు సులభమైన యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే, గత వెర్షన్ మాదిరిగా కాకుండా యూజర్లు కాల్‌కి తిరిగి రావడానికి గ్రీన్ స్టేటస్ బెల్ట్ ప్రెస్ చేయాల్సి రానున్నది. కొత్త కాల్ బార్ ఈ ప్రాసెస్ క్రమబద్ధీకరిస్తుంది. యూజర్స్ ఇప్పుడు కాల్ బార్ నుంచి నేరుగా కాల్‌ను మ్యూట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాల్ స్క్రీన్‌కి తిరిగి నావిగేట్ చేయాల్సిన అవసరాన్ని నివారిస్తుంది. దాంతో టైమింగ్‌ని సేవ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.

Latest News