Forbes World Billionaire List-2023 | ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ముఖేశ్‌ అంబానీ.. రెండోస్థానంలో అదానీ..!

Forbes World Billionaire List-2023 | రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 83.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. అలాగే అదానీ గ్రూప్స్‌ చైర్మన్‌ అదానీ 47.2 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 24వ స్థానానికి పడిపోయారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నాటికి 126 బిలియన్ల నికర సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడోస్థానంలో ఉన్నారు. హిండెబర్గ్‌ […]

  • Publish Date - April 5, 2023 / 06:21 PM IST

Forbes World Billionaire List-2023 | రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 83.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. అలాగే అదానీ గ్రూప్స్‌ చైర్మన్‌ అదానీ 47.2 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 24వ స్థానానికి పడిపోయారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నాటికి 126 బిలియన్ల నికర సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడోస్థానంలో ఉన్నారు. హిండెబర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక వెలుగు చూసిన తర్వాత సంపద భారీగా క్షీణిస్తూ వస్తున్నది. ఈసారి రికార్డు స్థాయిలో 169 మంతి భారతీయులు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ గతేడాది 166 మంది మాత్రం ఈ జాబితాలో చోటు సాధించారు. అయితే, సంపన్నుల జాబితా పెరిగినా.. 10శాతం సంపద దగ్గి 675 బిలియన్లకు చేరింది. 2022లో 750 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. ఫోర్బ్స్ ప్రకారం.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) గత ఏడాది వంద బిలియన్ల ఆదాయాన్ని దాటిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.

200 బిలియన్లు తగ్గిన సంపన్నుల ఆస్తి.. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌

ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ జాబితా ప్రకారం.. ప్రపంచంలోని 25 మంది సంపన్నుల మొత్తం సంపద ఏడాదిలో దాదాపు 200 బిలియన్లు తగ్గింది. 2022లో ఈ సంపద 2,300 బిలియన్లు ( 2.3 ట్రిలియన్ డాలర్లు) ఉండగా.. అది ఇప్పుడు 2,100 బిలియన్ల డాలర్ల (2.1 ట్రిలియన్‌ డాలర్లు)కు తగ్గింది. అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ సంపద అత్యధికంగా 57 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఎలోన్ మస్క్ సంపద ఏడాదిలో 39 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ నిలిచారు. ఆయన సంపద నికర విలువ 200 బిలియన్‌ డాలర్లు. రెండో స్థానంలో ఎలోన్ మస్క్ (180 బిలియన్ డాలర్లు), మూడోస్థానంలో జెఫ్ బెజోస్ (114 బిలియన్స్‌), నాలుగో స్థానంలో లారీ ఎలిసన్ (107 బిలియన్స్‌), వారెన్ బఫెట్ 106 బిలియన్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ 104 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో ఉన్నారు. మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ ఏడో, కార్ల్‌సన్ స్లిమ్ హెలు ఎనిమిదో, ముఖేష్ అంబానీ తొమ్మిది, స్టీవ్ బాల్మెర్ 10వ స్థానంలో నిలిచారు.

భారత్‌లో భారత్‌లో సంపన్నుల జాబితా..

ముఖేష్ అంబానీ : 83.6 బిలియన్
గౌతమ్ అదానీ : 43.1 బిలియన్
శివ్ నాడార్: 25.1 బిలియన్
సైరస్ పూనావాలా : 22.6 బిలియన్
లక్ష్మీ మిట్టల్ : 17.2 బిలియన్
సావిత్రి జిందాల్ కుటుంబం : 16.9 బిలియన్
దిలీప్ షాంఘ్వీ : 15.9 బిలియన్
రాధాకిషన్ దమానీ : 15.9 బిలియన్
కుమార్ బిర్లా : 14.2 బిలియన్
ఉదయ్ కోటక్ : 13.2 బిలియన్
అజీమ్ ప్రేమ్ జీ : 9.0 బిలియన్
రవి జైపురియా : 8.9 బిలియన్
కుశాల్ పాల్ సింగ్ : 8.4 బిలియన్
హస్ముఖ్ చుడ్గర్ కుటుంబం : 7.6 బిలియన్
బెను గోపాల్ బంగూర్ : 7.3 బిలియన్
అశ్విన్ డాని కుటుంబం : 6.8 బిలియన్
గోపీ కిషన్ దమానీ : 6.2 బిలియన్
విక్రమ్ లాల్ అండ్‌ కుటుంబం : 5.4 బిలియన్
ఎ.యూసుఫ్ అలీ : 5.3 బిలియన్
మహేంద్ర చోక్సీ అండ్‌ కుటుంబం : 5.3 బిలియన్
మిక్కీ జగ్తియాని : 5.2 బిలియన్
మురళీ దివి అండ్‌ కుటుంబం : 5.1 బిలియన్
పంకజ్ పటేల్ : 4.9 బిలియన్
మంగళ్ ప్రభాత్ లోధా : 4.4 బిలియన్
ఆర్.నారాయణ మూర్తి : 4.3 బిలియన్

Latest News