Billionaires | ప్రపంచవ్యాప్తంగా 8% తగ్గిన బిలియనీర్ల సంఖ్య.. 60% క్షీణించిన అదానీ సంపద..!

Billionaires | ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అదే సమయంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 16కు చేరింది. ఇందులో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం అగ్రస్థానంలో ఉన్నది. రాకేశ్‌ మరణం తర్వాత ఆయన భార్య ప్రస్తుతం వ్యాపారలావాదేవీలు చూసుకుంటున్నారు. 2023 ప్రపంచవ్యాప్తంగా 99 నగరాల్లోని 18 పరిశ్రమల నుంచి 176 మంది కొత్త బిలియనీర్లుగా పుట్టుకువచ్చారు. 2022లో ప్రపంచంలో మొత్తం 3,384 మంది బిలియనీర్లు ఉండగా.. 2023 నాటికి 3,112కి తగ్గింది. వీరంతా […]

  • Publish Date - March 23, 2023 / 02:28 AM IST

Billionaires | ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అదే సమయంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 16కు చేరింది. ఇందులో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం అగ్రస్థానంలో ఉన్నది. రాకేశ్‌ మరణం తర్వాత ఆయన భార్య ప్రస్తుతం వ్యాపారలావాదేవీలు చూసుకుంటున్నారు. 2023 ప్రపంచవ్యాప్తంగా 99 నగరాల్లోని 18 పరిశ్రమల నుంచి 176 మంది కొత్త బిలియనీర్లుగా పుట్టుకువచ్చారు. 2022లో ప్రపంచంలో మొత్తం 3,384 మంది బిలియనీర్లు ఉండగా.. 2023 నాటికి 3,112కి తగ్గింది. వీరంతా 69 దేశాలకు చెందిన వారు, వీరంతా 2,356 కంపెనీలున్నాయి. ఐదేళ్లలో భారతీయ బిలియనీర్ల సంపద 360 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇది హాకాంగ్‌ జీడీపీకి సమానం.

53 బిలియన్‌ డాలర్లకు అదానీ ఆస్తులు..

అమెజాన్ జెఫ్ బెజోస్ సంపద ఈ సంవత్సరం 70 బిలియన్లు క్షీణించింది. ఇది ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల నష్టాల కంటే ఎక్కువ. అదానీ ఆస్తులు 28 బిలియన్ డాలర్లు తగ్గి 53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 60 శాతం సంపద క్షీణించింది. అంటే ప్రతి వారం రూ.3వేలకోట్లు తగ్గముఖం పట్టింది. దీంతో సంపన్నుల జాబితాలో రెండో స్థానం నుంచి 23వ స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో అంబానీ సంపద 21 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇక భారత్‌లో 187 మంది బిలియనీర్లు భారతదేశంలో నివాసం ఉంటున్నారు. అయితే, మొత్తం 217 మంది భారతీయ మూలాలున్న బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముంబయి, బెంగళూరు, న్యూఢిల్లీ టాప్‌ 25 జాబితాలో నిలిచాయి. 69 మంది కొత్త బిలియనీర్లతో చైనా మొదటి స్థానంలో నిలువగా.. 26 మంది అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా.. సెర్గీ బ్రిన్‌కు 44 బిలియన్‌ డాలర్లు, లారీ పేజ్‌కి 41 బిలియన్‌ డాలర్లు నష్టం వాటిల్లింది. డీ మార్ట్‌ వ్యవస్థాపకుడు ఆర్‌కే దమానీ ఆస్తి 30శాతం తగ్గింది. దాంతో టాప్‌ 100 సంపన్నుల జాబితాలో చోటుదక్కలేదు.

Latest News