విధాత: దేశంలో సంచలనం రేపిన 26 /11 ముంబై దాడులు సూత్రధారి తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఢిల్లీ పాలమ్ ఎయిర్‌పోర్ట్‌లో తహవూర్ రాణాతో వచ్చిన ప్రత్యేక విమానం ల్యాండింగ్ అయ్యింది. అక్కడే తహవూర్ రాణాను అరెస్టు చేసిన అధికారులు ఎన్ఐఏ ఆఫీస్ కు తరలించారు. అక్కడ ఎన్ఐఏ న్యాయమూర్తి 2008ఉగ్రదాడి కేసులో రాణాను విచారించనున్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశ రాజధాని రీజియన్ లో హై అలర్ట్ ప్రకటించారు. విచారణ అనంతరం రాణాను పటిష్టమైన భద్రత మధ్య తీహార్ జైలుకు తరలించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అక్కడా రాణా కోసం ప్రత్యేక బారక్ ను సిద్దం చేశారు.
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణ 2008ముంబై ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలై రాణాను 2009లో ఎఫ్ బీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి రాణా అమెరికాలో ఉండిపోయారు. రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా కోర్టు 2024లో ఆమోదం తెలిపింది. దీనిపై రాణా వేసిన రివ్యూ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనల రాణాను భారత్ కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలిపారు. దీంతో రాణాను 16ఏళ్ల తర్వాతా తాజాగా భారత్ కు తీసుకవచ్చారు.
2008 ముంబై ఉగ్రదాడికి ముందు రాణాతో పాక్-అమెరికా టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ టచ్ లో ఉన్నారు. 26/11దాడికి ముందు హెడ్లీ 8సార్లు ఇండియాకు వచ్చాడని..ఆ సమయంలో 233సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడని విచారణలో తేలింది. లష్కరే తోయిబా కోసం రాణా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ తో ఆయనకు సంబంధాలున్నాయి. రాణా రాకతో ముంబై దాడి కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది.