Swiggy Bro English | హిమాలయ వర్షం నుంచి వరల్డ్ వార్ వరకు – స్విగ్గీ డెలివరీ బాయ్ నవ్వుల వరద లెక్చర్
“Underestimate the intercourse” అంటూ పంజాబ్ వరదలపై స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్. నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తినా, నిజానికి వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Swiggy Bro English | పంజాబ్‌లో వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్న వేళ, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy Delivery boy) ఇచ్చిన సీరియస్ దేశీ ఇంగ్లీష్ లెక్చర్ మాత్రం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఆ బాయ్ స్విగ్గీ ఆరెంజ్ షర్ట్ వేసుకుని రిపోర్టర్ల ముందు నిలబడి, “Himalaya parvat rainfall”, “this is China, this is the World War”, “underestimate the intercourse” అంటూ తనదైన ఇంగ్లీష్‌లో అనర్ఘళంగా ఉపన్యసించాడు. ఎవరూ అర్థం చేసుకోలేకపోయినా, నవ్వులు మాత్రం ఆపుకోలేకపోయారు.
Swiggy Bro ప్రసంగం – Highlights
- “Flood is the Himalaya parvat is a very rainfall and this is China, this is the World War, and you have Narendra Modi, Japan, Rus and Russia. Do you understand?”
- “No disaster that you like, rain fall is not. Because of to you, understand of my son? Theory, but now you have been underestimate the intercourse? No.”
- “Water level is the minus 50 and cubic centimeter, 1 lakh cubic, three to the power two, but flood is not. This is the seed of the Pusha, 22 and 22. This is Kasana.”
- “This is my father’s, well, Two rupees mazduri.”
👉 ఉద్దేశ్యమేంటో అర్థం కాలేదు కానీ, ఇంగ్లీష్ fluency మాత్రం నోబెల్ అవార్డ్ స్థాయి అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
The video of this person is going viral. When a journalist asked him about the floods in Punjab, listen to his reply. #PunjabFloods2025 pic.twitter.com/7pua14XVDk
— Gagandeep Singh (@Gagan4344) September 3, 2025
Here is the second part of the video, in which he explains more about the Punjab floods and the water level. (Part 2) #PunjabFloods2025 pic.twitter.com/KA60x31eL2
— Gagandeep Singh (@Gagan4344) September 4, 2025
సోషల్ మీడియాలో రచ్చ
- ఒకరు: “Bro spoke every English word he had learned since LKG in 2 minutes flat!”
- ఇంకొకరు: “Underestimate the intercourse is the new Oxford proverb.”
- మరొకరు: “Bro is very angry, but nobody knows why.”
- ఒకరు: “ఈ వరదల మధ్యలో intercourse ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు.” 😂
- ఇంకొందరు: “మనం ప్రశ్నలు స్థానిక భాషలో అడిగితే బాగుండేది… అయినా ధైర్యం, కాన్ఫిడెన్స్ సూపర్.”
Bro కి కొత్త బిరుదులు
- నెటిజన్లు ఇప్పటికే అతనికి కొత్త బిరుదులు పెట్టేశారు:
- “Swiggy Shakespeare”
- “Flood Einstein”
- “Intercourse Professor”
- “Punjab’s Oxford English” 😂
పంజాబ్ వరదల అసలు పరిస్థితి (Comedy Zone ముగిసింది)
- పంజాబ్‌లో 1988 తర్వాత ఇదే అత్యంత దారుణమైన వరదలు.
- 23 జిల్లాలు ప్రభావితమయ్యాయి, 1,655 గ్రామాలు నీటమునిగాయి.
- 3.5 లక్షల మంది ప్రభావితులు, 37 మంది మృతి.
- 1.75 లక్షల ఎకరాల పంట పొలాలు వరదలతో నాశనం – రైతులకు కుప్పకూలే నష్టం.
- ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని దుర్ఘటన ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది.
“Swiggy Bro” మాటలు సోషల్ మీడియాలో నవ్వులు పంచుతున్నా, పంజాబ్ ప్రజలు మాత్రం ఈ వరదలతో కన్నీటిపర్యంతమవుతున్నారు. సోషల్ మీడియాలో ఒకటే డైలాగ్:
👉 “Bro is a legend… underestimate the intercourse… never!” 😂