నా కడుపులో విరాట్ కోహ్లీ బిడ్డను మోస్తున్నా..యువతి హల్చల్

విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యానంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

నా కడుపులో విరాట్ కోహ్లీ బిడ్డను మోస్తున్నా..యువతి హల్చల్

విధాత, హైదరాబాద్ : టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యానంటూ ఓ యువతి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో నెట్టింటా దుమారం రేపుతుంది. విరాట్ కోహ్లీ కారణంగా తాను త్వరలో తల్లి కాబోతున్నానంటూ ఈ వీడియోలో ఆ యువతి చెప్పడం సంచలనంగా మారింది. గతంలో విరాట్ కోహ్లీ లవ్ బైట్ ఇచ్చాడు అని చెబితే మీరు నమ్మలేదని, ఇప్పుడు నేను విరాట్ కారణంగా గర్బవతిగా ఉన్నానని, ఇదైతే అబద్దం కాదంంటూ తన గర్బంతో ఉన్నానంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. అంతేకాదు.. వరుసగా విరాట్ కోహ్లీతో తనకు ఉన్న అనుబంధంపై వీడియోలు విడుదల చేస్తానంటూ ఆ యువతి వెల్లడించింది. ఈ వీడియో తర్వాత ఓ రేంజ్ లో ట్రోలింగ్ అవుతానని ఈ వీడియోలో ఆ యువతి ముందుగానే చెప్పడంతో ఆమె విరాట్ కోహ్లీని అడ్డం పెట్టుకుని ఫేమస్ అవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ రోజుల ఐపీఎల్ 19 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుస్తుందని, ఎస్సార్ హెచ్ టీమ్ ఓడిపోతుందని, ఎందుకంటే ప్రారంభ మ్యాచ్ లో ఎప్పుడు ఆర్సీబీ ఓడిపోలేదని, అటు విరాట్ కోహ్లీ ఉన్నాడంటూ వీడియోలో ఆ యువతి చెప్పుకొచ్చింది.

గతంలో బిగ్ బాస్ షో కి గెస్ట్ గా వచ్చి హాల్ చల్

విరాట్ కోహ్లీపై ఆరోపణలు చేసిన ఆ యువతి క్రితం సారి బిగ్‌బాస్‌లో అతిథిగా వెళ్లి సందడి చేసింది. గతంతో పాతబస్తీలో నివసించానని చెప్పిన ఆమె తర్వాత దుబాయ్ వెళ్లినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ యువతి వైఖరి చూస్తే విరాట్ కోహ్లీపై ఆరోపణలతో వైరల్ అవడానికి ఎత్తులు వేస్తుందని, ఇలాంటి వాళ్ళు సమాజానికి చాల ప్రమాదకరం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Free Biryani | బంపరాఫర్.. గ్యాస్ సిలిండర్ ఇవ్వండి.. నెల రోజులు బిర్యానీ ఫ్రీగా తినండి.. !
Vivo V70 FE | 7000mAh బ్యాటరీ, 200మెగాపిక్సెల్ కెమెరాతో వివో మొబైల్.. లాంచ్ ఎప్పుడంటే..!