Anushka Sharma | బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా తన స్వతంత్ర ఆలోచనలతో కూడా అనుష్క ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డేటింగ్ విషయంలో అనుష్క ప్రత్యేక రూల్

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల నుంచే అనుష్క తన వ్యక్తిగత జీవితంలో కొన్ని కఠినమైన సూత్రాలను పాటించేవారట. ముఖ్యంగా డేటింగ్ సమయంలో బిల్లులను సగం పంచుకోవడం ఆమెకు అలవాటు. ఎవరైనా పురుషుడు తన కోసం డబ్బు ఖర్చు చేశాడని చెప్పుకునే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

2011లో విడుదలైన లేడీస్ వ‌ర్సెస్ రిక్కీ బాల్ సినిమా ప్రమోషన్ల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క ఈ విషయాలను పంచుకున్నారు.

గిఫ్ట్‌లు తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు

ఎవరైనా నాకు బహుమతులు ఇస్తే చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. గిఫ్ట్ కల్చర్ నాకు అంతగా నచ్చదు” అని అనుష్క పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా గిఫ్ట్ ఇస్తే, దాని విలువ తెలుసుకుని అదే స్థాయి లేదా అంతకంటే ఎక్కువ విలువైన బహుమతిని తిరిగి ఇచ్చేదాన్నని తెలిపారు.

బిల్లు నేను కడతాను లేదా సగం పంచుకుంటాను

ఏ మగాడూ నాపై డబ్బు ఖర్చు పెట్టానని చెప్పుకోకూడదు. హోటల్‌కు వెళ్తే నేను బిల్లు మొత్తం చెల్లిస్తాను లేదా కనీసం సగం పంచుకుంటాను. అవతలి వ్యక్తి మొత్తం ఖర్చు పెట్టడాన్ని నేను ఒప్పుకోను అని అనుష్క స్పష్టం చేశారు.

2010లో విడుదలైన బ్యాండ్ బాజా బ‌రాత్ సినిమా తర్వాత అనుష్క, ర‌ణ‌వీర్ సింగ్ ప్రేమాయణం నడిచిందంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరిగింది.

విరాట్‌తో ప్రేమ.. ఇటలీలో గ్రాండ్ వెడ్డింగ్

2013లో ఓ షాంపూ ప్రకటన షూటింగ్ సందర్భంగా అనుష్కకు విరాట్ కోహ్లీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ జంటగా నిలిచారు.

కొంతకాలం రిలేషన్‌లో ఉన్న ఈ జంట 2017 డిసెంబర్‌లో ఇటలీలోని ట‌స్కనీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ ఉన్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం

వివాహం అనంతరం అనుష్క శర్మ సినిమాలకు క్రమంగా దూరమయ్యారు. కుటుంబం, పిల్లల పెంపకానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 2018లో విడుదలైన Zero తర్వాత ఆమె పూర్తి స్థాయి పాత్రలో కనిపించలేదు. 2022లో వచ్చిన కాలాలో మాత్రం అతిథి పాత్రలో మెరిశారు.