సినిమా కాదు..నీళ్లలో జరజర పాకుతూ గ్రీన్ అనకొండ హల్చల్ !
నీటిలో జరజర పాకుతూ భారీ గ్రీన్ అనకొండ వీడియో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన ఈ జాతి ప్రవర్తన నెటిజన్లను ఆకట్టుకుంది.
విధాత : భూమిపైన, నీళ్లలో ప్రయాణిస్తూ..వేటాడుతూ జీవించే అనకొండ పాములు అత్యంత ప్రమాదకరమైన జీవ జాతులుగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా భారీ ఆకారంతో కనిపించే అమెజాన్ అడవులలో సంచరించే గ్రీన్ అనకొండలను చూస్తే ఒళ్లు జలధరించకతప్పదు. తాజాగా కొలంబియాలోని ల్యానోస్ చిత్తడి నేలల్లోని లోతు లేని జలాల్లో ఓ ఆకుపచ్చ అనకొండ సర్రున పాకుతూ వెళ్లిపోయిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. 4.5 మీటర్లు (14.7 అడుగుల) ఈ ఆకుపచ్చ భారీ అనకొండ శరీర నిర్మాణం నీటిలో వేగంగా ఈదడానికి అనువుగా ఉంటుంది. అందుకే అది నీటిలో జరజర దూసుకెళ్లగలిగింది. అనకొండ సినిమా తరహాలో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ గ్రీన్ అనకొండ కళ్లు, ముక్కు తల పైభాగంలో ఉండటం వల్ల, నీటిలో మునిగి ఉన్నా బయట ఏం జరుగుతుందో గమనించగలదు. అయితే భూమిపై మాత్రం దీని బరువైన భారీ ఆకారం వల్ల చాలా నెమ్మదిగా కదులుతుంది. అందుకే ఇది ఎక్కువగా నీటి వనరుల దగ్గరే గడుపుతుంది.
అనకొండలలో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. గ్రీన్ అనకొండ రకం అన్నింటికంటే పెద్దది, బలమైనది. గ్రీన్ అనకొండ సాధారణంగా 15 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతుంది. మగ అనకొండల కంటే ఆడ అనకొండలే పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి.పసుపు అనకొండ 10-13 అడుగులు పెరుగుతుంది. ఎక్కువగా పరాగ్వే నదీ ప్రాంతంలో కనిపిస్తుంది. బొలీవియన్ అనకొండ జాతి ఎక్కువగా బొలీవియాలో ఎక్కువగా కనిపిస్తుంది. నల్ల మచ్చల అనకొండలు తక్కువగా కనిపిస్తుంటాయి.
అనకొండలకు విషం ఉండదు. తమ బలమైన శరీరంతో వేటలో తనదైన పెద్దదైన జంతువును కూడా చుట్టుముట్టి, ఎముకలు విరిగేలా గట్టిగా నొక్కి, ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఆ తర్వాత తన నోరును పెద్దదిగా చేసి మింగేస్తుంది. ఒక్కసారి భారీ వేట దొరికితే తిరిగి ఆహారం లేకుండా అనకొండ నెలల తరబ
A 4.5-meter (14.7-foot) green anaconda glides through the shallow waters of the Colombian Llanos pic.twitter.com/DOs6pM1Oxi
— Nature Unedited (@NatureUnedited) April 8, 2026
ఇవి కూడా చదవండి :
ఏప్రిల్ పది నుంచి రహదారులపై ప్రయాణానికి కొత్త రూల్స్..
ఏప్రిల్ పది నుంచి రహదారులపై ప్రయాణానికి కొత్త రూల్స్..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram