Bengaluru | లారీని తప్పించబోయి.. మూడు పల్టీలు కొట్టిన వాటర్ ట్యాంకర్ (వీడియో)
Bengaluru | విధాత: రోడ్డు ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఎన్నో కుటుంబాలలో విషాదం నింపుతున్నప్పటికి వాహన చోదకులు మాత్రం రాష్ డ్రైవింగ్ మానడం లేదు. అడ్డగోలు డ్రైవింగ్ తో తాము ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా ఆ దారిన వెళ్లే వాహనాదారులనూ కూడా ప్రమాదాల్లో పడేస్తుంటారు కొందరు ప్రబుద్దులు. బెంగళూరు – వైట్‌ఫీల్డ్ ఏరియాలో అతివేగంతో వెలుతున్న ఓ వాటర్ ట్యాంకర్ ముందున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ఆ ట్యాంకర్ రోడ్డుపై బంతిలా దొర్లుతూ పల్టీలు కొట్టిన వీడియో వైరల్ గా మారింది.
ప్రమాద తీవ్రత చూస్తూ ఆ ట్యాంకర్ డ్రైవర్ అతివేగం అర్దమవుతోంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ట్యాంకర్ ఫల్టీలు కొట్టే క్రమంలో మరో వాహనాన్ని ఢీ కొనకపోవడం..డివైడర్ దాటి ఆవలి వరుసలోని వాహనాలకు ప్రమాదం కల్గించకపోవడంతో పెను ప్రమాదాలు..ప్రాణ నష్టాలు తప్పాయి. వాటర్ ట్యాంకర్ విధ్వంసాన్ని చూసిన నెటిజన్లు నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
లారీని తప్పించబోయి.. మూడు ఫల్టీలు కొట్టిన వాటర్ ట్యాంకర్ (వీడియో) #Bengaluru, A #Speeding water tanker overturned, when the driver lost control of the vehicle, while overtaking a lorry, horrific accident captured on the #DashCamera of a nearby car. #viralvideo #viral pic.twitter.com/RxQOzpvGsK
— srk (@srk9484) April 15, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram