Leopard Jumps From Tree To Tree | చెట్లపై చిరుత జంపింగ్ లు..వావ్ అనాల్సిందే!
వన్యప్రాణుల్లో వేగం, చెట్లు ఎక్కడంలో చిరుతకు సాటి లేదు. నిటారుగా ఉన్న చెట్టు ఎక్కి, పక్క చెట్లపైకి చిరుత జంప్ చేసిన అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విధాత: వన్యప్రాణుల్లో అత్యంత వేగంగా పరుగెత్తడంలో..చెట్లు ఎక్కడంలో చిరుత పులికి సాటి లేదంటారు. చిరుతలు చెట్లు ఎక్కడానికి దాని శరీర నిర్మాణం..ముడుచుకునే పంజాలు, తక్కువ గురుత్వాకర్షణ కేంద్రం, బలమైన భుజాలు, ముందరి కాళ్ళు వాటి బరువును పైకి ఎగబాకేందుకు అనుకూలంగా ఉండటం ఉపకరిస్తాయి. చాల చిరుత పులులు ఆహారం కోసం జంతువులను వేటాడేందుకు చెట్లపైకి ఎక్కి మాటు వేయడం…వేటాడిన జంతువులను ఇతర క్రూరమృగాలు వంటివి లాక్కెళ్లకుండా చెట్టుపైకి తీసుకెళ్లి తినడం చూస్తుంటాం.
అయితే ఓ చిరుత అడవిలో నిటారుగా ఉన్న చెట్టు ఎక్కడంతో పాటు పక్క చెట్లపైకి జంప్ చేసిన దృశ్యం వైరల్ గా మారింది. చెట్టు ఎక్కడంలో…పక్క చెట్లపైకి దూకడంలో చిరుత నైపుణ్యం చూస్తూ నిపుణులైన పర్వతారోహకులు, జంపింగ్ నిపుణులు కూడా విస్మయం చెందక మానరు. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు చెట్లు ఎక్కడం..దూకడంలో చిరుత నైపుణ్యానికి ఫిదా అయిపోతున్నారు. వేటాడిన ఆహారాన్ని దాచేందుకు చిరుతలు చెట్లను నిచ్చెనలా మాదిరిగా వాడుకుంటున్నాయని కామెంట్ చేశారు.
Leopards have the perfect physiology to climb trees. Retractable claws, low centre of gravity, strong shoulders and forelimbs to pull their weight up.
As proficient climbers, they can use trees as larders to store their food
— Science girl (@gunsnrosesgirl3) October 6, 2025