Blue Snake Video : ప్రకృతిలోని రకరకాల జీవరాశులలో వింతలు, అద్భుతాలతో కూడిన జీవులు ఎన్నో దర్శనమిస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన..అద్బుతమైన వింత పాము ఒకటి నీలి రంగులో మెరిసిపోతూ అశ్చర్యపరస్తుంది. తూర్పు ఇండిగో పాము (డ్రైమార్చోన్ కూపెరి) గా పిలిచే ఈ నీలిరంగు పాము సంచార దృశ్యం వీడియో చూసిన నెటిజన్లు ప్రకృతిలో ఇలాంటి పాములు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తూర్పు ఇండిగో పాము శరీరం నల్లటి మెరిసే పొలుసులతో ఎర్రటి, క్రీమ్ రంగు గొంతు కలిగి ఉన్నప్పటికి సూర్యరశ్మి దానిపై పడగానే.. అద్భుతమైన ఇరిడెసెంట్ నీలి రంగు కాంతులతో మెరిసిపోతుంది. ఈ రంగు మారే శరీర లక్షణమే దీనిని ప్రకృతిలో నీలిరంగు పాముగా గుర్తింపు కల్పించింది.
ఎక్కువగా అగ్నేయ అమెరికాలో కనిపించే నిలీరంగు పాము 1978 నుండి అంతరించిపోతున్న జాతుల చట్టం కింద చేర్చబడింది. అమెరికా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ డేటా ప్రకారం ఇప్పుడు ఈ పాములు కేవలం 10,000 కంటే తక్కువే ఉన్నాయి. దాదాపు 10అడుగుల వరకు పెరిగే ఈ విషరహిత తూర్పు ఇండిగో పాము దాని భయంకరమైన రూపానికి విరుద్ధంగా ఇతర విషపూరిత పాములు, ఎలుకలను వేటాడుతుంది. చిత్తడి అడవుల పర్యావరణ సమతుల్యతలో తనవంతు పాత్ర పోషిస్తుంది.
A rare blue snake’s movement highlights its glossy, reflective skin pic.twitter.com/ayPvg2bANY
— Potato (@MrLaalpotato) December 22, 2025
ఇవి కూడా చదవండి :
Bird Eats Snake| తన పొడవు పామును మింగేసిన కొంగ..వీడియో వైరల్
Snakes Brumation | చలికాలంలో పాములు ఎక్కడ ఉంటాయి? వాటిని కాపాడే బ్రూమేషన్ అంటే ఏంటో తెలుసా?
Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?
