అది ఒకే పాము కాదు..రెండు పాముల పోరాటం వైరల్ వీడియో !

చూడటానికి ఒకే భారీ పాములా కనిపించిన దృశ్యం చివరకు రెండు పాముల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరాటంగా తేలింది. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చూడటానికి ఓ పొడవైన పాము అదే పనిగా మెలికలు తిరుగుతూ కనిపిస్తుంది. నిశితంగా గమనిస్తే అక్కడ రెండు పాములు ఉన్నాయన్న సంగతి అవగతమవుతుంది. రెండు పాముల మధ్య సాగిన పోరాటం ఓ పొడవైన పామును తలపించిన వీడియో వైరల్ గా మారింది.

ఓ తోటలో రెండు పాములు పరస్పరం ఎదురుపడి ప్రత్యర్థిని ఆహారంగా మింగేయాలని ప్రయత్నించాయి. ఈ క్రమంలో రెండు పాములు పోరాటానికి దిగాయి. ఓ పామును మరో పాము నోట కరుచుకోగా దాని పట్టు నుంచి విడిపించుకునేందుకు బాధిత పాము తీవ్రంగా మెలికలు తిరగడం ఆరంభించింది. అయితే తన నోటి పట్టు నుంచి బాధిత పాము తప్పించుకోకుండా ఆ పాము కూడా దానితో పాటు మెలికలు తిరుగ సాగింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన రైతు ఆ పాముల పోరాటాల దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించాడు.

మొదట అదంతా ఒకే పొడవైన పాముగా భావించిన రైతు..చివరకు రెండు పాములు అక్కడ పోరాడుతున్నాయని గ్రహించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం అందులో తొలుత ఒకే పొడవైన పాము ఉందని భావించడం..వీడియో సాగుతున్న కొద్ది అక్కడ రెండు పాములు పోరాడుతున్నట్లుగా గ్రహిస్తుండటంతో ఇది వైరల్ గా మారింది.

Latest News