హీరోయిన్‌ను టార్చ‌ర్ చేసిన స్టార్‌ హీరో.. పూన‌మ్ కౌర్‌ చెప్పింది అత‌ని గురించేనా?

  • By: sr    actress    Jan 07, 2025 1:45 PM IST
హీరోయిన్‌ను టార్చ‌ర్ చేసిన స్టార్‌ హీరో.. పూన‌మ్ కౌర్‌ చెప్పింది అత‌ని గురించేనా?

విధాత‌: రెండు మూడు నెల‌ల క్రితం టాలీవుడ్ అగ్ర‌ ద‌ర్శకుడు త్రివిక్ర‌మ్‌పై ఆరోప‌ణ‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించిన న‌టి పూన‌మ్‌కౌర్ తాజాగా మ‌రోమారు మ‌రో బాంబు పేల్చింది. త్రివిక్ర‌మ్ వ్య‌వ‌హారంపై మా అసోషియేష‌న్‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డంలేదంటూ పూన‌మ్‌ వాపోయింది. దీనిపై మా స‌భ్యుడు శివ బాలాజీ స్పందించి మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్ప‌గా వెంట‌నే ఇదుకో సాక్ష్యం అంటూ పూన‌మ్ మ‌రో ట్వీట్ చేసి ఫిర్యాదు చేసిన ఆక‌నలెడ్జ్‌మెంట్‌ను సైతం జ‌త చేసింది. దీంతో మా అసోసియేష‌న్ ఇప్పుడు సందిగ్దంలో ప‌డింది. అయితే ఇది ఇలానే కొన‌సాగుతుండ‌గా పూన‌మ్ గ‌తంలో ఓ స్టార్ హీరో ఒక హీరోయిన్‌ని దారుణంగా వేధిస్తున్నాడంటూ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

నాడు ఆమె త‌న పోస్టులో ‘నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో నాతో పాటు న‌టించిన ఓ అమ్మాయి తర్వాత హీరోయిన్‌గా కూడా కొన్ని చిత్రాలు చేసింది. ఆపై మ‌ధ్యలోనే సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఎవరికీ కనిపించకుండా పోయింది. రీసెంట్‌గా ఆ న‌టి ఒక ఫ్లైట్‌లో కనిపించి పెళ్ళికి షాపింగ్‌కి వచ్చినట్లు, నేను ఈ దేశంలో ఉన్నట్లు ఎవరికీ చెప్పొదంటూ రిక్వెస్ట్ చేసిందని పూన‌మ్ తెలిపింది. ఏమైందని నేను అడగగా ఆమె సమాధానమిస్తూ.. ‘సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో నన్ను వేధిస్తున్నాడు.. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడు. ఓ సినిమాలో ఇంటి‌మేట్ సీన్‌లో నా మొహంపై నిజంగానే ఉమ్మి వేశాడు. డైరెక్టర్ కట్ కూడా చెప్పలేదు’ అంటూ చెప్పిందని పూన‌మ్ తెలిపింది.

ఇక‌ ఆ తర్వాత ఆ న‌టి ఇండస్ట్రీ వదిలి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిందని.. అయినా ఆ హీరో వేదింపులు ఇంకా తగ్గలేదని, ఇది కట్టు కథ కాదని చెప్పిందన్నారు. నేను ఆ అమ్మాయిని హగ్ చేసుకొని ఓదార్చానంటూ రాసుకొచ్చింది. అయితే పూన‌మ్ త‌న పోస్టులో తమిళనాడు అని వ్రాసి క్రింద మాత్రం తెలుగు సినిమా అని మెన్షన్ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమె మీడియా అటెన్సన్ కోసం ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉండ‌గా పూన‌మ్ చెప్పిన‌ ఆ హీరో, ఆ హీరోయిన్ ఎవ‌రై ఉంటార‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాను జ‌ల్లడ ప‌డుతున్నారు. చాలామంది మ‌న తెలుగు హీరోలై ఉంటార‌ని అనుకున్నారు.

అయితే.. పూన‌మ్ న‌టించిన ఆ సోషియో ఫాంటసీ చిత్రం వెంక‌టేశ్ నాగ‌వ‌ళ్లి కాగా ఆ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది రిచా గంగోఫాధ్యాయ్ (Richa Gangopadhyay). రిచా అంత‌కుముందు ర‌వితేజ మిర‌ప‌కాయ్‌, సారొచ్చారు, ప్ర‌భాస్ మిర్చి వంటి భారీ సినిమాల్లో న‌టించింది. అంతేకాదు త‌మిళంలో ధ‌నుష్‌తోనూ ఓ సినిమా చేసింది. ఇదిలాఉంటే పైన పూన‌మ్ చేసిన పోస్టు ధ‌నుష్ (Dhanush)కు పోలి ఉండ‌డం విశేషం. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన మయక్కం ఎన్నా (Mayakkam Enna) సినిమాలో మాన‌సిక స్థితి స‌రిగ్గాలేని పాత్ర‌లో హీరో ధ‌నుష్‌ న‌టించ‌గా అత‌నికి భార్య‌గా నిత్యం తోడుగా వెనువెంటే ఉంటూ సేవ చేసే పాత్ర‌లో రిచా కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమాలోనే ఇంటిమేట్ సీన్ల‌తో పాటు పైన చెప్పిన ఓ స‌న్నివేశం కూడా ఉంటుంది.

ఈ సినిమాకు గాను రిచాకు మూడు అంత‌ర్జాతీయ అవార్డులు సైతం రావ‌డం, ఈ సినిమా త‌మిళ‌నాట ఓ కల్ట్ క్లాసిక్‌ చిత్రంగా పేరుపొంద‌డం గ‌మ‌నార్హం. ఇదిలాఉండ‌గా ధ‌నుష్‌ను విమ‌ర్శిస్తూ న‌య‌న‌తార ఓ లెట‌ర్ విడుద‌ల చేసిన స‌మ‌యంలోనే ఈ ఇష్యూ తెర‌మీద‌కు రావ‌డం యాదృశ్చికం. ఈ మూవీ మిస్ట‌ర్ కార్తీక్‌గా తెలుగులోనూ వ‌చ్చింది.