Dhanush – Mrunal | ధనుష్- మృణాల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఆ రోజే అంటూ నెట్టింట ప్రచారాలు
Dhanush - Mrunal | తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్‌లో ‘సీతారామం’తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న డేటింగ్ పుకార్లు మరోసారి తెరపైకి వచ్చాయి.
Dhanush – Mrunal | తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్‌లో ‘సీతారామం’తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న డేటింగ్ పుకార్లు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈసారి అవి మరింత హీట్ పెంచాయి. కారణం ఫిబ్రవరి 14, 2026న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడతారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడమే. వాలెంటైన్స్ డే సందర్భంగా పెళ్లి అంటూ వస్తున్న పోస్టులు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
పరిమిత అతిథులతో సింపుల్ వెడ్డింగ్?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం, ఈ పెళ్లి కార్యక్రమం చాలా ప్రైవేట్‌గా జరిగే అవకాశం ఉందట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు సీక్రెట్‌గా వివాహాలు చేసుకోవడం చూస్తుంటే, ఇదీ అలాంటి వెడ్డింగే కావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
రూమర్లకు కారణమైన సంకేతాలు
ధనుష్–మృణాల్ మధ్య రిలేషన్ ఉందనే ఊహాగానాలకు కొన్ని సంఘటనలు బలం చేకూర్చాయి. ఒకరి సినిమా ఈవెంట్స్‌కు మరొకరు హాజరుకావడం, సోషల్ మీడియాలో పరస్పరం ఫాలో అవ్వడం, ధనుష్ పోస్టులకు మృణాల్ కామెంట్స్ వైరల్ కావడం వంటి విషయాలు ఈ ప్రచారానికి దారి తీశాయి. అంతేకాదు, మృణాల్ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ ఈవెంట్‌లో ధనుష్ కనిపించడం అప్పట్లోనే చర్చకు కారణమైంది.
అధికారిక స్పందన మాత్రం లేదు
ఈ మొత్తం హడావుడి మధ్య ధనుష్ గానీ, మృణాల్ ఠాకూర్ గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఖండించను లేదు, ధృవీకరణ కూడా చేయలేదు. దీంతో “నిజంగా ఏదో జరుగుతోందా?” అనే సందేహం అభిమానుల్లో పెరుగుతోంది. గతంలో ఇలాంటి వార్తలను మృణాల్ ఖండించిన సందర్భాలున్నప్పటికీ, ఈసారి మౌనం కొనసాగుతుండటమే రూమర్లకు మరింత ఊపునిస్తోంది.
సీక్రెట్ వెడ్డింగ్స్ ట్రెండ్‌లోనా?
ఇటీవల పలువురు సెలబ్రిటీలు అతి తక్కువ మందితో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసుకోవడం తెలిసిందే. ఆ కోవలోనే ధనుష్–మృణాల్ పెళ్లి కూడా జరిగితే ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ధనుష్ గతంలో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో వివాహం చేసుకుని తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
నిజమెప్పుడు బయటపడుతుంది?
ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ హాట్‌గా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ధనుష్–మృణాల్ పేర్లు ట్రెండింగ్‌లో కొనసాగడం ఖాయమే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram