Dragon Fruit Farming | పాత టైర్ల‌తో ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ సాగు.. ఏడాదికి రూ. 40 ల‌క్ష‌లు సంపాదిస్తున్న భార్యాభ‌ర్త‌లు

Dragon Fruit Farming | అత‌ను ఎంసీఏ ప‌ట్ట‌భ‌ద్రుడు.. ఆమె సైన్స్ గ్రాడ్యుయేట్.. రైస్ మిల్లు వ్యాపారం( Rice Mill Business ) ఉండేది. కానీ ఆ వ్యాపారం దివాళా తీసింది. అప్పులు( Debts ) కుప్పలుగా మారాయి. అప్పుల నుంచి ఎలా గ‌ట్టెక్కాలో అర్థం కావ‌డం లేదు. నిత్యం అప్పుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆయ‌న జీవితాన్ని ఓ పెళ్లి విందు( Marriage Dinner ) మార్చేసింది. ఆ విందులో ఆర‌గించిన డ్రాగ‌న్ ఫ్రూట్( Dragon Fruit )ఆయ‌న‌ను ల‌క్షాధికారిని చేసింది. మ‌రి ఆయ‌న విజ‌యగాథ గురించి తెలుసుకోవాలంటే ఒడిశా( Odisha ) వెళ్ల‌క త‌ప్ప‌దు.

Dragon Fruit Farming | ఒడిశా( Odisha ) కు చెందిన ముర‌ళీ కృష్ణ( Murali Krishna ) ఎంసీఏ ప‌ట్ట‌భ‌ద్రుడు. ఆయ‌న‌కు రైస్ మిల్లు వ్యాపారం( Rice Mill Business ) ఉండేది. కానీ 2016లో అది మూత‌బ‌డింది. దీంతో అప్పుల భారంతో కుంగిపోయాడు. కానీ ఓ పెళ్లి విందు Marriage Dinner ) ఆయ‌న జీవితాన్ని మార్చేసింది. ఆ విందులో తిన్న డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ).. ఇప్పుడు ఆయ‌న‌ను ల‌క్షాధికారిని చేసింది. త‌న భార్య‌తో క‌లిసి ఏడాదికి రూ. 40 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు.

రైస్ మిల్లు మూత‌ప‌డిన త‌ర్వాత‌.. ఏం చేయాలో ముర‌ళికి తోచ‌లేదు. అప్పులేమో మోపెడై కూర్చున్నాయి. ఎలా తీర్చాలో అర్థం కాక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. అయితే అదే స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్ట‌ణం( Vishakhapattanam )లో జ‌రిగిన ఓ పెళ్లి విందుకు ముర‌ళి త‌న భార్య‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు. ఆ విందులో ముర‌ళి డ్రాగ‌న్ ఫ్రూట్‌ను తిన్నాడు. రుచి అదిరిపోవ‌డంతో.. దాని మూలాల‌పై దృష్టి సారించాడు ముర‌ళి. వెంబ‌డే దీన్ని ఎక్క‌డ్నుంచి తెచ్చార‌ని క్యాట‌రింగ్ య‌జ‌మానిని అడిగాడు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, తెలంగాణ నుంచి డ్రాగ‌న్‌ఫ్రూట్ కొనుగోలు చేసిన‌ట్లు అత‌ను ముర‌ళికి తెలిపాడు.

2018లో ఫ‌లాలను ఇవ్వ‌డం ప్రారంభించాయి..

ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. 2017లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ‌గ‌ఢ్‌కు చెందిన ఒక రైతు నుంచి నాలుగు డ్రాగ‌న్ ఫ్రూట్ మొక్క‌ల‌ను కొనుగోలు చేశారు. వాటిని ఒడిశా సంభాల్‌పూర్ జిల్లాలోని త‌న వ్య‌వ‌సాయ భూమిలో నాటాడు. తెలంగాణ నుంచి కూడా మ‌రో నాలుగు మొక్క‌లు కొన‌సాగు చేసి సాగు చేశాడు. కానీ ఫ‌లితం అంత‌గా లేదు. రాయ‌గ‌ఢ్ నుంచి తెచ్చిన మొక్క‌లు పెర‌గ‌లేదు. తెలంగాణ నుంచి కొనుగోలు చేసిన మొక్క‌లు మ‌రుస‌టి ఏడాది అంటే 2018లో ఫ‌లాలను ఇవ్వ‌డం ప్రారంభించాయి. దీంతో డ్రాగ‌న్ ఫ్రూట్ సాగును విస్త‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు ముర‌ళి దంప‌తులు.

భార్య బంగారం తాక‌ట్టు..

డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు విస్త‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ స‌రిప‌డా డ‌బ్బు లేదు. దీంతో భార్య ఒంటిపై ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌ను బ్యాంకులో తాక‌ట్టు పెట్టారు. మొత్తంగా 10 వేల డ్రాగ‌న్ ఫ్రూట్ మొక్క‌ల కొనుగోలుకు రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబడి పెట్టారు.

పాత టైర్ల‌తో వినూత్న ప్ర‌యోగం..

ఈ డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు చేసే రైతులు చాలా మంది.. సిమెంట్ స్తంభాల‌పై సిమెంట్ రింగుల‌ను ఏర్పాటు చేస్తారు. ఇది ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఇందుకు ప్ర‌త్యామ్నాయంగా సిమెంట్ స్తంభాల‌పై పాత టైర్ల‌ను అమ‌ర్చారు. ఐదు ఎక‌రాల పొలంలో 2,500 స్తంభాల‌ను నాటి.. ప్ర‌తి స్తంభానికి ఒక పాత టైరును బిగించారు. ఇలా చేయ‌డంతో ముర‌ళికి రూ. 3.75 ల‌క్ష‌ల ఖ‌ర్చు త‌గ్గింది.

సేంద్రీయ ఎరువుల‌తో డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు

సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అనురాధ‌.. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కింద 6 నెల‌ల సాటు సేంద్రీయ వ్య‌వ‌సాయంలో శిక్ష‌ణ పొందారు. సాగుకు సంబంధించి అనేక మెళ‌కువ‌లు నేర్చుకున్నారు. జీవామృతం, వేప ఆకులు వంటి సేంద్రీయ ఎరువుల‌ను వినియోగించారు. ఎలాంటి ర‌సాయ‌నాలు లేకుండా ఆర్గానిక్ మెథ‌డ్‌లో డ్రాగ‌న్ ఫ్రూట్స్ పండించారు. దీంతో వీరి సాగు చేసిన పండ్ల‌కు మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది.

 ఏడాదికి రూ. 40 ల‌క్ష‌లు సంపాదిస్తూ..

2020లో రెండు ట‌న్నుల వ‌ర‌కు దిగుబ‌డి సాధించారు. కిలో పండ్ల‌ను రూ. 220 చొప్పున విక్ర‌యించారు. 2021లో ఆరు ట‌న్నుల పండ్ల‌ను పండించారు. 2025లో ఐదు ఎక‌రాల్లో మొత్తం 30 ట‌న్నుల డ్రాగ‌న్ ఫ్రూట్స్‌ను పండించి.. ల‌క్షాధికారులుగా మారారు. ఎక‌రానికి రూ. 8 ల‌క్ష‌ల ఆదాయం వ‌స్తుంది ఏడాదికి. ఇలా సంవ‌త్స‌రానికి రూ. 40 ల‌క్ష‌లు సంపాదిస్తూ… డ్రాగ‌న్ ఫ్రూట్ సాగును అత్యంత లాభదాయ‌క‌మైన పంట‌గా మార్చుకున్నారు ముర‌ళి దంప‌తులు. ఒడిశాతో పాటు ఢిల్లీ, కోల్‌క‌తా, హైద‌రాబాద్, బెంగ‌ళూరు, నాగ్‌పూర్, రాయ్‌పూర్ వంటి ప్ర‌ధాన న‌గ‌రాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు.

చేప‌ల వ్యాపారం ద్వారా రూ. 1.5 కోట్ల ఆదాయం..

కేవ‌లం డ్రాగ‌న్ ఫ్రూట్ సాగే కాకుండా.. అద‌న‌పు ఆదాయ మార్గాల‌ను కూడా ముర‌ళి దంప‌తులు సృష్టించుకున్నారు. వారి పొలంలో ఆరు చేప‌ల చెరువుల‌ను అభివృద్ధి చేశారు. సుమారు 22 వేల చేప పిల్ల‌ల‌ను పెంచుతున్నారు. 2021 నుంచి ప్ర‌తి ఏడాది 20 ట‌న్నుల చేప‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నారు. కిలో చేప‌ల‌ను రూ. 150 చొప్పున విక్ర‌యిస్తున్నారు. గ‌త ఐదేండ్ల‌లో చేప‌ల వ్యాపారం ద్వారా రూ. 1.5 కోట్ల ఆదాయం ఆర్జించ‌గా, దాదాపు రూ.75 ల‌క్ష‌ల లాభాలు పొందారు.

కేవ‌లం ఈ సాగుతో రూ. 60 ల‌క్ష‌ల ఆదాయం సంపాదించాల‌ని..

2026 నాటికి 40 ట‌న్నులు, 2027 నాటికి 50 ట‌న్నుల వ‌ర‌కు డ్రాగ‌న్ ఫ్రూట్స్‌ను పండించాల‌నే ప్లానింగ్‌లో ఉన్నారు. కేవ‌లం ఈ సాగుతో రూ. 60 ల‌క్ష‌ల ఆదాయం సంపాదించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ముర‌ళి దంపతులు పేర్కొన్నారు.

 

Latest News