CEO Mukesh Kumar Meena | ఏపీలో 81శాతం పోలింగ్ నమోదు కావచ్చు
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చని సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకొని ఇప్పటివరకు 79.40 శాతం పోలింగ్ నమోదైందని, రాత్రి 12 గంటల వరకు 78.25శాతం పోలింగ్ జరిగిందన్నారు.
సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడి
సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా
విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చని సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకొని ఇప్పటివరకు 79.40 శాతం పోలింగ్ నమోదైందని, రాత్రి 12 గంటల వరకు 78.25శాతం పోలింగ్ జరిగిందన్నారు. పోలింగ్ శాతంపై సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని ఆయన పేర్కోన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి రెండు గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదయిందని, 0.6శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 79.8% నమోదైందన్నారు. కాగా విశాఖ జిల్లాలో గత ఎన్నికలతో పోల్చితే ఓటర్లు పెరిగినా పోలింగ్ 3శాతం తగ్గడం చర్చనీయాంశమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram