వైఎస్సార్ ఆచరణల్లోంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల రామకృష్ణా రెడ్డి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ వర్ధంతివిధాత,గుంటూరు:పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్‌ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు,ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, జూపూడి ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,తెలుగు అకాడెమీ […]

వైఎస్సార్ ఆచరణల్లోంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల రామకృష్ణా రెడ్డి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ వర్ధంతి
విధాత,గుంటూరు:పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్‌ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు,ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, జూపూడి ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ ఆచరణల్లోంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. నాన్న వేసిన అడుగుకి పదడుగులు వైఎస్‌ జగన్‌ వేశారన్నారు. వైఎస్సార్‌ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్‌ జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ను బలోపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని పిలుపునిచ్చారు.