ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేయసి గొంతుకోసి ప్రియుడి ఆత్మహత్యాయత్నం

తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రేమోన్మాది చేసిన కిరాతకానికి ఓ యువతి బలైంది. ఏలూరు జిల్లా సత్రంపాడులో ప్రేమించలేదని యువతి గొంతుకోసి హత్య చేసిన ఏసురత్నం అనే యువకుడు..ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు

  • Publish Date - May 30, 2024 / 03:25 PM IST

విధాత: తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రేమోన్మాది చేసిన కిరాతకానికి ఓ యువతి బలైంది. ఏలూరు జిల్లా సత్రంపాడులో ప్రేమించలేదని యువతి గొంతుకోసి హత్య చేసిన ఏసురత్నం అనే యువకుడు..ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువతి మృతిచెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితుడి ప్రేమికురాలిపై లైంగిక దాడి

మ‌రోప‌క్క‌ ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో స్నేహితుడి ప్రియురాలిపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన సూళ్లూరుపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. యువతి పుట్టినరోజున ఆలయానికి తీసుకెళ్తామని అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. స్నేహితుడి చేతులు కట్టివేసి అతడి ముందే ప్రియురాలిపై అతని తోటి స్నేహితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు.

Latest News