అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ఆరోగ్య శ్రీ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చిందని.. మార్చి 31 వచ్చినా హామీ మేరకు బకాయిలు చెల్లించలేదని ఆషా ప్రతినిధులు తమ లేఖలో ఆరోపించారు.
గత నాలుగు నెలలుగా రూ. 3000 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినప్పటికి ప్రభుత్వం బకాయిలు చెల్లింపుల దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అసోసియేషన్ పేర్కొంది.
బకాయిల విడుదలతో పాటు 2017 నాటి ప్యాకేజీల రేట్లు సవరించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. పాత ప్యాకేజీ ధరలనే ఇంకా కొనసాగిస్తుండటంతో.. పెరిగిన వైద్య, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారం సాధించే వరకు బంద్ కొనసాగిస్తామని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
AP High Court Jobs | ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. పోస్టును బట్టి జీతం నెలకు రూ.1.47లక్షలు!
NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు
