Roja | ఓటమి దిశగా మంత్రి ఆర్కే రోజా.. ఆమె ట్వీట్ నెట్టింట వైరల్
Roja | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి స్పష్టమైన మెజార్టీని సాధించింది. 155 స్థానాల్లో కూటమి లీడింగ్‌లో ఉంది. ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా ఓటమి దిశగా పయనిస్తున్నారు. రోజాపై టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Roja | అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి స్పష్టమైన మెజార్టీని సాధించింది. 155 స్థానాల్లో కూటమి లీడింగ్‌లో ఉంది. ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా ఓటమి దిశగా పయనిస్తున్నారు. రోజాపై టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అయితే ఆమె ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది సేపటికే ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. రోజా ట్వీట్ సారాంశం ఏంటంటే.. శక్తివంతమైన వ్యక్తి అంటే భయాలే విశ్వాసంగా .. ఎదురుదెబ్బలే పునరాగమనంగా.. మన్నింపులే నిర్ణయాలుగా, తప్పులే పాఠాలుగా నేర్చుకునే వ్యక్తి.. అనే సందేశాన్ని జోడిస్తూ.. ఓ చిన్నారి నుంచి రోజా పువ్వును స్వీకరిస్తున్న సందర్భంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రోజా ఓటమి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
A powerful person is someone who converts:
❝
fears into confidence, setbacks into comebacks, excuses into decisions, mistakes into learnings.❜#QuoteOfTheDay pic.twitter.com/9SWkGN3KJD— Roja Selvamani (@RojaSelvamaniRK) June 4, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram