కల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు..వీడియో వైరల్

సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పర్యటించారు 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు.ఈ సందర్భంగా తాటికల్లు రుచి చూశారు.

సీఎం చంద్రబాబు తను తినే ఆహారం విషయంలో ఎంత పరిమితంగా ఉంటారు.తన ఆహారపు అలవాట్ల గురించి తరచూ ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నం మానేశాను, ప్రోటీన్ మాత్రమే తింటున్నాను… అనే మాట ఆయన పలుమార్లు చెబుతున్నారు. తను రోజు తిసుకునే మిత ఆహారం గురించి ఇటీవల ఓ సమావేశంలో పునరుద్ఘాటించారు. అలాంటి చంద్రబాబు తన పర్యటనలలో ప్రకృతి సహజసిద్దమైన ఆహారం, పండ్లు వంటివి ఎదురుపడితే తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఓసారి అరకు కాఫీ, మరోసారి రోడ్డు పక్కన ముంజలు తింటూ తన ఆసక్తిని ప్రదర్శించారు.

తాజాగాసీఎం చంద్రబాబు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పర్యటించారు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు.ఈ సందర్భంగా కల్లు గీత వృత్తి, కల్లుగీసే విధానం, ఆదాయ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం తాటికల్లు రుచి చూశారు. సింహాచలంకు సొంతిల్లు, ట్యాప్ కనెక్షన్ ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

 

Latest News