Chandrababu Conducts Aerial Survey | తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

మోంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలైన బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరులలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఓడలరేవు వద్ద ల్యాండై, సహాయ పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు.

Chandrababu Conducts Aerial Survey | తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

అమరావతి : మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ కొనసాగింది.
చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేశారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడల రేవులో చంద్రబాబు ల్యాండ్ అయ్యారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.

ఇక్కడి తుపాను బాధితుల సహాయ పునరావాస కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. తుపాను బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మొంథా తుపాన్ పెను విపత్తు అని, దీంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకుందని..ఈ నేపథ్యంలో మొంథా తుపానును ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అన్నారు. తుపాన్ ప్రభావిత ఆస్తి నష్టాలను తగ్గించగలిగామన్నారు. ప్రాణ నష్టాలను నివారించామని తెలిపారు.