Site icon vidhaatha

CM Jagan | కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు ఏపీ సీఎం జగన్‌

జూన్ 1వరకు పర్యటన

విధాత: ఏపీ సీఎం జగన్ కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్‌, ఫ్రాన్స్‌, స్వీట్జర్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత లండన్ వెళ్లనున్న జగన్ కుటుంబం జూన్ 1 వరకు ఆయా దేశాల్లో పర్యటిస్తారు. జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ తీరక లేకుండా గడిపిన జగన్ పోలింగ్ ముగిసిపోవడం.. ఫలితాల వెల్లడికి జూన్ 4వరకు సమయం ఉండటంతో విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే జూన్ 1న ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. జగన్ గతంలోనూ పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో కొన్ని రోజులుగా ప్రధాన పార్టీల నేతలు కూడా కుటుంబ సభ్యులతో విహార పర్యటనలకు వెలుతున్నారు.

Exit mobile version