అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళి
విధాత:నేడు దివంగత రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యావత్ భారత్ ఘన నివాళులు అర్పిస్తోంది. ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. అబ‍్దుల్ కలాం భారత్‌లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో ఒకరని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం […]
విధాత:నేడు దివంగత రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యావత్ భారత్ ఘన నివాళులు అర్పిస్తోంది. ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు.
అబ‍్దుల్ కలాం భారత్‌లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో ఒకరని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం చేసిన కృషి వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం జగన్ పేర్కొన్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram