నిందితులను అరెస్ట్ చేసి.. శిరీషకుచేసి న్యాయం చెయ్యాలి
విధాత:పశ్చిమ గోదావరి జిల్లా. టీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన శిరీష కు న్యాయం చేయుట గురించి రాష్ట్ర మహిళా సంఘాల ఐక్య వేదిక బృందం పర్యటన.28 5-21న ఓగిరాల శిరీష అనే అమ్మాయిని భర్త .మరియు బాధితురాలి తల్లి సహకారంతో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పంచాయతీ పేరుతో తీసుకెళ్ళారు.ఆతరువాత అమ్మాయిని మేం తీసుకొస్తామని నమ్మించి.నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులకు శిరీష జూన్ నెలలో రిపోర్ట్ ఇవ్వగా డి.ఎస్.పి జంగారెడ్డిగూడెం రవి […]

విధాత:పశ్చిమ గోదావరి జిల్లా. టీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన శిరీష కు న్యాయం చేయుట గురించి రాష్ట్ర మహిళా సంఘాల ఐక్య వేదిక బృందం పర్యటన.28 5-21న ఓగిరాల శిరీష అనే అమ్మాయిని భర్త .మరియు బాధితురాలి తల్లి సహకారంతో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పంచాయతీ పేరుతో తీసుకెళ్ళారు.ఆతరువాత అమ్మాయిని మేం తీసుకొస్తామని నమ్మించి.నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులకు శిరీష జూన్ నెలలో రిపోర్ట్ ఇవ్వగా డి.ఎస్.పి జంగారెడ్డిగూడెం రవి కిరణ్ నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుని ఫిర్యాది శిరీషను దుర్బాషలాడారని,ఏఎస్ఐ జ్యోతి,ట్రైనీ ఎస్ఐ. జయలక్ష్మి లు శిరీష తో రాజీకి బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నం చేశారని శిరీష ఆరోపించారు.
ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని వెంటనే అరెస్టు చేసి శిరీష కు న్యాయం చేయాలని మహిళా సంఘం వారు శనివారం అప్పలరాజుగూడెం సర్పంచ్ జల్లా మూర్తి ఇంటి వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ పాల్గొని శిరీషను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కేసు విషయంలో ముద్దాయి తరఫున వత్తాసు పలుకుతూ. ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందజేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ డిమాండ్ చేశారు.శిరీష కు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం,పునరావాసం, ఉద్యోగం ఇచ్చి భద్రత కల్పించాలని డిమండ్ .ఈ కార్యక్రమంలో ఐద్వా సంఘ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి,మహిళ సమైక్య రాష్ట్ర కార్యదర్శి.పి.దుర్గ భవాని తదితరులు పాల్గొన్నారు.