విధాత: మంటగలుస్తున్న మానవ సంబంధాలకు మరో మచ్చుతునకగా ఈ విషాద ఘటన నిలుస్తుంది. అత్తమీద కోపంతో ఓ కోడలు దారుణానికి పాల్పడింది. వృద్ధురాలైన తన అత్తను కాళ్లు, చేతులు కట్టి, కళ్లకు గంతలు కట్టేసి ఆమెకు నిప్పుపెట్టింది. ఈ అమానుష ఘటన విశాకపట్నంలోని అప్పన్న పాలెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వర్షిణీ అపార్ట్‌మెంట్‌లో జయంతి కనకమహాలక్ష్మీ(66) తన కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత వారి పిల్లలతో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య శర్మ బయటకు వెళ్లారు. ఆతర్వాత వారి ఇంటి నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో జయంతి కనకమహాలక్ష్మీ సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న లలితను విచారించగా టీవీ వద్ద షాట్ సర్క్యూట్ అయిందని అందువల్ల మంటలు చెలరేగాయని తెలిపింది. కనకమహాలక్ష్మీ కాలిపోయిన తీరుపై అనుమానం రావడంతో.. ఇళ్లంతా పరిశీలించారు. ఎక్కడా షార్ట్ సర్క్యూట్ అవ్వలేదని నిర్ధారించుకున్నారు. దీంతో లలితను లోతుగా విచారించగా తానే ఈ దారుణానికి పాల్పడ్డట్లు అంగీకరించింది. తన అత్తను కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఆపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పక్కకు తోసేసింది. ఆమె కాలిపోతున్న సమయంలో కేకలు వినిపించకుండా టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టింది. ఇదిలా ఉంటే తన అత్తను ఎలా చంపాలని హౌ టూ కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ను చూసినట్లు తేలింది.
Visakhapatnam : కాళ్లు, చేతులు కట్టి ఆపై కళ్లకు గంతలు కట్టి అత్తకు నిప్పు పెట్టిన కోడలు
విశాఖలో దారుణం.. అత్తను కాళ్లు, చేతులు కట్టి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన కోడలు. టీవీ సౌండ్ పెంచి కేకలు వినిపించకుండా చూసింది.

Latest News
సమ్మర్లో మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిందా.. ఈ టిప్స్‌తో సమస్యను చిటికెలో సాల్వ్ చేయండి!
చెప్పులు విప్పిన గుట్టు… భార్య రహస్యం రట్టు!
అదే క్లాసిక్ డిజైన్.. కానీ అధునాతన ఫీచర్లు.. మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 రీఎంట్రీ!
ఎండలో ఉన్నా.. కింద పడ్డా సేఫ్‌గా ఉండే మొబైల్.. రూ.35వేలలోనే తీసుకొస్తున్న ఒప్పో
సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే రోజున 'వారణాసి' బిగ్ సర్ప్రైజ్?
ఇది మీ ఇండియా కాదు.. రోడ్డుపై గుట్కా ఉమ్మేసిన టూరిస్ట్‌ను కడిగిపారేసిన నేపాలీ.. వీడియో వైరల్
స్పెయిన్‌లో మంచి జాబ్.. ఫ్రీగా ఇల్లు.. బంపరాఫర్ పొందాలంటే ఆ ఒక్కటే కండీషన్!
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి !
కారుపై పడిన సిమెంట్ ట్యాంకర్..ఒకరి మృతి