Surypet | దారుణం.. డబ్బుల కోసం సోదరి, కోడళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిన మేనమామ

మానవ సంబంధాలు.. నేడు మనీ సంబంధాలుగా మారుతున్నాయి. డబ్బుల కోసం రక్తసంబంధీకులపైనే దాడులు చేస్తున్నారు కొందరు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలఓ చోటు చేసుకుంది.

Surypet | దారుణం.. డబ్బుల కోసం సోదరి, కోడళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిన మేనమామ

విధాత, హైదరాబాద్ :

మానవ సంబంధాలు.. నేడు మనీ సంబంధాలుగా మారుతున్నాయి. డబ్బుల కోసం రక్తసంబంధీకులపైనే దాడులు చేస్తున్నారు కొందరు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలఓ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కళావతి, రాంరెడ్డి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కళావతి తన కూతురు జ్యోతికి అప్పుగా కొంత డబ్బు ఇచ్చింది. ఈ క్రమంలో కొడుకు ఉపేందర్ రెడ్డికి..కూతురు జ్యోతికి మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. దీంతోపాటు జ్యోతి తన తల్లికి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి.

అయితే, జ్యోతి తన పొలంలో పని చేయిస్తుండగా అక్కడికి వచ్చిన తల్లి కళావతి.. అన్న రాంరెడ్డి పనులను అడ్డుకున్నారు. వరికోత మిషన్‌కు ట్రాక్టర్ అడ్డుపెట్టి డ్రైవర్ ను బెదిరించడంతో అతను పారిపోయాడు. ఆవేశంతో ఉన్న ఉపేందర్ రెడ్డి సోదరి జ్యోతితో పాటు, ఇద్దరు మేనకోడళ్లపై ట్రాక్టర్ ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేశాడు. దీంతో వారు గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు, రైతులు అక్కడికి చేరుకొని గొడవను ఆపారు.