Visakhapatnam : కాళ్లు, చేతులు కట్టి ఆపై కళ్లకు గంతలు కట్టి అత్తకు నిప్పు పెట్టిన కోడలు
విశాఖలో దారుణం.. అత్తను కాళ్లు, చేతులు కట్టి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన కోడలు. టీవీ సౌండ్ పెంచి కేకలు వినిపించకుండా చూసింది.
విధాత: మంటగలుస్తున్న మానవ సంబంధాలకు మరో మచ్చుతునకగా ఈ విషాద ఘటన నిలుస్తుంది. అత్తమీద కోపంతో ఓ కోడలు దారుణానికి పాల్పడింది. వృద్ధురాలైన తన అత్తను కాళ్లు, చేతులు కట్టి, కళ్లకు గంతలు కట్టేసి ఆమెకు నిప్పుపెట్టింది. ఈ అమానుష ఘటన విశాకపట్నంలోని అప్పన్న పాలెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వర్షిణీ అపార్ట్‌మెంట్‌లో జయంతి కనకమహాలక్ష్మీ(66) తన కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత వారి పిల్లలతో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య శర్మ బయటకు వెళ్లారు. ఆతర్వాత వారి ఇంటి నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో జయంతి కనకమహాలక్ష్మీ సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న లలితను విచారించగా టీవీ వద్ద షాట్ సర్క్యూట్ అయిందని అందువల్ల మంటలు చెలరేగాయని తెలిపింది. కనకమహాలక్ష్మీ కాలిపోయిన తీరుపై అనుమానం రావడంతో.. ఇళ్లంతా పరిశీలించారు. ఎక్కడా షార్ట్ సర్క్యూట్ అవ్వలేదని నిర్ధారించుకున్నారు. దీంతో లలితను లోతుగా విచారించగా తానే ఈ దారుణానికి పాల్పడ్డట్లు అంగీకరించింది. తన అత్తను కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఆపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పక్కకు తోసేసింది. ఆమె కాలిపోతున్న సమయంలో కేకలు వినిపించకుండా టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టింది. ఇదిలా ఉంటే తన అత్తను ఎలా చంపాలని హౌ టూ కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ను చూసినట్లు తేలింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram