Bhartha Mahasayulaku Wignyapthi | ర‌వితేజ స్టైల్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైల‌ర్.. ఈ సారి హిట్ ప‌క్కానా..!

Bhartha Mahasayulaku Wignyapthi | మాస్ మహారాజా రవితేజ మరోసారి నవ్వుల పండుగకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి తాజాగా ట్రైల‌ర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో, ట్రైల‌ర్‌తోనే సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

  • By: sn |    movies |    Published on : Jan 07, 2026 5:13 PM IST
Bhartha Mahasayulaku Wignyapthi | ర‌వితేజ స్టైల్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైల‌ర్.. ఈ సారి హిట్ ప‌క్కానా..!

Bhartha Mahasayulaku Wignyapthi | మాస్ మహారాజా రవితేజ మరోసారి నవ్వుల పండుగకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి తాజాగా ట్రైల‌ర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో, ట్రైల‌ర్‌తోనే సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇందులో స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ర‌వితేజ ఫ‌న్నీగా క‌నిపించారు. సున్నితమైన అంశాన్ని హాస్యభరితంగా చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. డైలాగ్స్, సిట్యువేషనల్ కామెడీ ట్రైల‌ర్‌కు ప్రధాన బలం అయ్యాయి. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమా హిట్ ప‌క్కా అంటున్నారు.

ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. ఇది రవితేజ కెరీర్‌లో 76వ సినిమా కావడం విశేషం. వెన్నెల కిశోర్, సునీల్, మురళీధర్ గౌడ్, సత్య, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మాస్ జాతర’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో, ఈ సినిమాపై రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ట్రైల‌ర్ చూసిన తర్వాత “ఇదే అసలైన రవితేజ మార్క్ కామెడీ” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి ట్రైల‌ర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి రేసులో ఎంతవరకు నవ్వుల హిట్‌గా నిలుస్తుందో చూడాలి.ఈ సినిమాకి పోటీగా చాలా సినిమాలు విడుద‌ల అవుతుండ‌గా, వాట‌న్నింటితో పోటీ ప‌డీ భ‌ర్త మ‌హాశ‌యులకి విజ్ఞ‌ప్తి చిత్రం రేసులో ఎంత వ‌ర‌కు నిలుస్తుందో చూడాలి.