బీసీ యువ నేత ఆధ్వ‌ర్యంలో తెరనేకల్ గ్రామంలో ఉచితంగా ఆనందయ్య ఔషదం పంపిణీ

విధాత,క‌ర్నూలు:ఆదోని నియోజ‌క‌వ‌ర్గంలోని తెరనేకల్ గ్రామంలో సోమవారం 1500 మందికి ఆనందయ్య కరోనా నివారణ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. రాయలసీమ బి.సి.యువజన విభాగం అధ్యక్షులు డాక్టర్. నాగేశ్వరరావు అద్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా డాక్టర్.నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఎటువంటి సందేహం లేకుండా ఆనందయ్య మందు తీసుకోవాలన్నారు. అదేవిధంగా చాలా చోట్ల పంపిణీ చేసిన దానికంటే సొంత గ్రామంలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు లో అనేక సేవకార్యక్రమాలు గ్రామంలో చేపడుతానని […]

బీసీ యువ నేత ఆధ్వ‌ర్యంలో తెరనేకల్ గ్రామంలో ఉచితంగా ఆనందయ్య ఔషదం పంపిణీ

విధాత,క‌ర్నూలు:ఆదోని నియోజ‌క‌వ‌ర్గంలోని తెరనేకల్ గ్రామంలో సోమవారం 1500 మందికి ఆనందయ్య కరోనా నివారణ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. రాయలసీమ బి.సి.యువజన విభాగం అధ్యక్షులు డాక్టర్. నాగేశ్వరరావు అద్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సందర్భంగా డాక్టర్.నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఎటువంటి సందేహం లేకుండా ఆనందయ్య మందు తీసుకోవాలన్నారు. అదేవిధంగా చాలా చోట్ల పంపిణీ చేసిన దానికంటే సొంత గ్రామంలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు లో అనేక సేవకార్యక్రమాలు గ్రామంలో చేపడుతానని తెలియచేసారు.తెరనేకల్ భగీరథ సంఘం అధ్యక్షులు పైయింటి వీరేష్ , యువజన నాయకులు పులి నరేష్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో మొదటిసారిగా సొంత‌ గ్రామంలో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ స్కూల్ చైర్మన్ ఆంజనేయులు, గ్రామ పెద్దలు శ్రీరాములు,గడ్డం నాగరాజు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.