Site icon vidhaatha

ప‌ల్నాడులో పోటెత్తుతున్న వ‌ర‌ద‌లు

విధాత‌: గుంటూరు జిల్లా,పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. రెండు రోజల క్రితం దాచేపల్లి మండలం, కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.

Exit mobile version