తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుత కలకలం
తిరుమలలో చిరుత పులుల కలకలం కొనసాగుతుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేసింది.
విధాత : తిరుమలలో చిరుత పులుల కలకలం కొనసాగుతుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేసింది. బుధవారం తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డు వచ్చింది. ఈ దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు, భక్తులను అప్రమత్తం చేశారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని తెలిపారు.
కాగా గతంలో కూడా ఇదే ప్రదేశంలో చిరుత పులులు పలుమార్లు కనిపించడం గమనార్హం. కొద్దినెలల క్రితం అక్షిత అనే చిన్నారిపై దాడి చేసిన చిరుతతో పాటు మరో రెండు చిరుతలను అధికారులు పట్టుకున్నప్పటికి తరుచు ఘాట్ రోడ్డు మార్గంలో చిరుతల సంచారం కొనసాగుతుండటం భక్తులను భయాందోళనకు గురి చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram