విధాత: పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.
ఆగష్టు 16 వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కళాశాలలు ప్రారంభించిన దృష్టా గురువారం విద్యా శాఖామాత్యులు డాక్టర్ అదిమూలపు సురేష్, విద్యా శాఖ మరియు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం లో నిర్వహించారు.
ఈ సమావేశం లో ప్రస్తుతం రాష్ట్రంలో గల covid పరిస్టితులను విశ్లేషణ చేస్తూ, ఇప్పటి వరకు వాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు మరియు ప్రస్తుతం covid పాజిటివ్ గా నమోదైన విద్యార్ధుల, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని మిగిలిన 7,388 మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉండగా 100 శాతం పూర్తి చేసెందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. దీని పట్ల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ స్పందిస్తూ ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల వాక్సిన్ లు అందుబాటులో వున్నాయని, వంద మందికి వాక్సిన్ ఒకేసారి వేయడానికి గాను విద్యా శాఖ ఏ కేంద్రాన్ని ప్రతిపాదిస్తే అక్కడ వాక్సిన్ వేసే ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి గాను సంబందిత జిల్లా విద్యాశాఖాధికారులు ఆయా జిల్లా వైద్యాధికారి ని సంప్రదిస్తే చాలని తెలియజేసారు. పాఠశాలల్లో విద్యార్ధులు సామాజిక దూరం పాటిస్తే, చాలావరకు covid వ్యాప్తిని నివారించవచ్చని తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడానికి ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తప్పక పాటించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యా సంస్థలైన విశ్వ విద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు వంటి వాటిలో సిబ్బందికి, విద్యార్థులకు కూడా వాక్సినేషన్ వేయించడానికి తగిన ఆదేశాలు వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వవలసిందిగా గౌరవ మంత్రివర్యులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ను కోరారు. ఇందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ స్పందిస్తూ ఇప్పటికే అన్ని విద్యాసంస్థలలోని సిబ్బందికి వాక్సినేషన్ వేయించవలసిందిగా ఆదేశాలు ఇచ్చామని, ఈ ఆదేశాలను పునరుద్ఘాటిస్తామని తెలియజేసారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉన్నత విద్యా మండలి కమీషనర్ పోలా భాస్కర్,
ఇంటర్మీడియెట్ విద్య కమీషనర్ రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు
<p>విధాత: పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.ఆగష్టు 16 వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కళాశాలలు ప్రారంభించిన దృష్టా గురువారం విద్యా శాఖామాత్యులు డాక్టర్ అదిమూలపు సురేష్, విద్యా శాఖ మరియు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం […]</p>
Latest News

మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచన..!
అందరూ అగమాగం – ఎవరు సక్కగున్నరు? : జగిత్యాలలో కేసీఆర్ ఫైర్
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ పేల్చిన ఢిల్లీ బాంబు
సోషల్ మీడియాలో అనసూయపై అసభ్యకర పోస్టులు..
మేడిగడ్డ పరీక్షల పూర్తికి మే నెలాఖరు డెడ్‌లైన్.. బరాజ్‌ను సందర్శించిన సీఎం రేవంత్..
త్వరలో భూముల విలువలు పెంపు...రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా
పెద్దితో మాస్ స్టెప్పులు వేసే ఛాన్స్ దక్కించుకున్న సాయి ధరమ్ బ్యూటీ..
అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ